అంబరాన్నంటిన దసరా సంబురాలు

ABN , First Publish Date - 2022-10-07T04:56:43+05:30 IST

దసరా పండుగను బుధవారం ప్రజలు ఆనందోత్సా హాలతో జరుపుకున్నారు. ఆలయాల దర్శనాలు, వాహన పూజలు నిర్వ హించారు. అనంతరం సాయంత్రం జమ్మి చెట్టుకు వద్దకు వెళ్ళి పూజల అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్దల ఆశీర్వచ నాలు అందుకున్నారు.

అంబరాన్నంటిన దసరా సంబురాలు
బెల్లంపల్లిలో రాంలీలలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

ఏసీసీ, అక్టోబరు 6: దసరా పండుగను బుధవారం ప్రజలు ఆనందోత్సా హాలతో జరుపుకున్నారు. ఆలయాల దర్శనాలు, వాహన పూజలు నిర్వ హించారు. అనంతరం సాయంత్రం జమ్మి చెట్టుకు వద్దకు వెళ్ళి పూజల అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్దల ఆశీర్వచ నాలు అందుకున్నారు. మంచిర్యాల పట్టణంలోని గోదారి ఒడ్డున ఉన్న గౌతమే శ్వర ఆలయంలో నిర్వహించిన జమ్మి పూజలో ఎమ్మెల్యే దివాకర్‌ రావు పాల్గొన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌  పెంట రాజయ్య, కౌన్సిలర్‌ హరి కృష్ణ, సత్యం, పట్టణ  ప్రధాన కార్యదర్శి  రాకేష్‌, విజిత్‌రావు పాల్గొన్నారు.  

వినాయకనగర్‌లో నిర్వహించిన శమీ పూజలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసా గర్‌రావు పాల్గొన్నారు.  అనంతరం గోదావరి తీరన గల గౌతమేశ్వర ఆలయంలో జమ్మి చెట్టు వద్ద  పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో దసరా వేడుకలను  ఘనంగా జరుపు కున్నారు. పట్టణంలోని తిలక్‌ స్టేడియంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎంపీ గడ్డం వివేకానందలు పాల్గొన్నారు. స్టేడియంలో రాంలీల నిర్వహించారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, ఉత్సవ కమిటీ సభ్యులు సంతోష్‌ ,రమేష్‌, విద్యాసాగర్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Read more