నేటి నుంచి బాసరలో దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-26T06:38:18+05:30 IST

దసరా నవరాత్రి మహోత్సవాలకు బాసర అమ్మవారి సన్నిధి సిద్దమైంది.

నేటి నుంచి బాసరలో దసరా ఉత్సవాలు
అమ్మవారి ఆలయానికి విద్యుత్‌ దీపాలతో అలంకరణ

మొదటి రోజు శైలపుత్రి అవతారంలో దర్శనం 

బాసర, సెప్టెంబరు, 25 : దసరా నవరాత్రి మహోత్సవాలకు బాసర అమ్మవారి సన్నిధి సిద్దమైంది. సోమవారం ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్‌ 4వ తేదీ వరకు జరగుతాయి. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బం దులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు  చేశారు. అమ్మవారి ఆల యంతో పాటు ప్రాకార మండపాలకు, ఉపఆలయాన్నింటికీ విద్యుత్‌ దీపా లతో అలంకరించారు. ముఖ్యంగా మూలనక్షత్రం నుంచి భక్తుల తాకిడి అధి కంగా ఉండే అవకాశం ఉంది. ఆ రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల మొదటిరోజు అమ్మవారికి విశిష్టఅభిషేక పూజ నిర్వహించనున్నారు. అనంతరం కళశ స్థాపన, విఘ్నే శ్వర పూజ అంకురార్పణ వంటి పూజలు జరగనున్నాయి. మొదటిరోజు సరస్వతీ అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల ఏర్పాట్లలను ఆదివారం ముథోల్‌ ఎమ్మెల్యే పరిశీలించారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట బాసర సర్పంచ్‌ లక్ష్మన్‌రావు, మండల ఉపాఽ ద్యక్షులు నర్సింగ్‌రావు, పీఏసీఎస్‌ చైర్మెన్‌ వెంకటేష్‌ గౌడ్‌, మాజీ ఎంపీటీసీ పోతన్న, నాయకులు జ్ఞాని పటేల్‌, శ్యామ్‌, మల్లయ్య, తదితరులు ఉన్నారు. 

Read more