పోషకాహార లోపం భర్తీ చేసేందుకే కిట్ల పంపిణీ

ABN , First Publish Date - 2022-08-04T06:51:50+05:30 IST

కిషోర బాలికల్లో పోషకాహార లోప నివారణకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పోషకాహార కిట్లను పంపిణీ చేస్తోందని ముథోల్‌ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి తెలిపారు.

పోషకాహార లోపం భర్తీ చేసేందుకే కిట్ల పంపిణీ
బాలికలకు కిట్లు పంపిణీ చేస్తున్న ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

ముథోల్‌, ఆగస్టు 3 : కిషోర బాలికల్లో పోషకాహార లోప నివారణకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పోషకాహార కిట్లను పంపిణీ చేస్తోందని ముథోల్‌ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన ముథోల్‌లోని డీలక్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిశోర బాలికలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విఠల్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం 11-14 సంవత్సరాలు కలిగిన వికలాంగులు, బడి మానే సిన కిశోర బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారించేం దుకు ప్రతిష్ఠాత్మకంగా కిట్లను అందిస్తుందన్నారు. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో 43 మంది లబ్ధిదారులకు కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. కిశోర బాలికలకు హెచ్‌బి శాతాన్ని పరీక్షించి కిట్లు తీసుకున్న అనంతరం వచ్చిన హెచ్‌బిని పరిశీలించడం జరుగుతుందన్నారు. అన్ని పోషక విలువలు కలిగిన కిట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గ్రామాల్లో పక్క అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అవస రమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంగన్వాడీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమ ంలో డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, సీడీపీవో శ్రీమతి, ఎంపీడీవో సురేష్‌బాబు, వైద్యు లు ఆకాష్‌ గడపాలే, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T06:51:50+05:30 IST