‘కల్యాణలక్ష్మి’ చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2022-10-13T03:29:48+05:30 IST

పేదింటి ఆడబిడ్డల వివాహాలు భారం కాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ కల్యా ణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో 19 మందికి మంజూరైన చెక్కులను అందజేశారు.

‘కల్యాణలక్ష్మి’ చెక్కుల పంపిణీ
దండేపల్లిలో లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

దండేపల్లి, అక్టోబరు 12: పేదింటి ఆడబిడ్డల వివాహాలు భారం కాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ కల్యా ణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో 19 మందికి మంజూరైన చెక్కులను అందజేశారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని అనేక సం క్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ అమ లు చేస్తున్నారన్నారు.  ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ గురవయ్య,  పీఏసీఎస్‌ చైర్మ న్‌ లింగన్న, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్‌, వెంకటేష్‌, తహసీల్దార్‌ హన్మంతరావు, డిప్యూటీ తహసీల్దార్‌ విజయ, ఆర్‌ఐ రంజిత్‌కుమార్‌, పాల్గొన్నారు.  

నస్పూర్‌: తీగల్‌పహాడ్‌, ప్రశాంత్‌ నగర్‌, సీతారాంపల్లి, తదితర ఏరి యాల్లో వివిధ కారణాలతో మరణిం చిన వారి  కుటుంబ సభ్యులను బుఽధ వారం ఎమ్మెల్యే దివాకర్‌రావు పరామ ర్శించారు. సీతారాంపల్లిలోని ఇరు కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మున్సి పల్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు సుబ్బయ్య, కౌన్సిలర్‌  వంగ తిరుపతి, పట్టణ యూత్‌ విభా గం అధ్యక్షుడు చెల్లా విక్రం, వార్డు అధ్యక్షుడు సమ్మయ్య పాల్గొన్నారు.   

Read more