15న నులి పురుగుల నిర్మూలన మాత్రల పంపిణీ

ABN , First Publish Date - 2022-09-09T04:22:56+05:30 IST

నులి పురు గుల నిర్మూలనపై జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వ హిస్తామని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నులి పురు గుల నిర్మూలనపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో డీసీపీ అఖిల్‌ మహజన్‌, ట్రైనీ కలెక్టర్‌ గౌతమితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల ని ర్మూలనకు ప్రణాళిక రూపొందించామన్నారు

15న నులి పురుగుల నిర్మూలన మాత్రల పంపిణీ
నులిపురుగుల నిర్మూలన మాత్రలను విడుదల చేస్తున్న కలెక్టర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 8: నులి పురు గుల నిర్మూలనపై జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వ హిస్తామని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నులి పురు గుల  నిర్మూలనపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో డీసీపీ అఖిల్‌ మహజన్‌, ట్రైనీ కలెక్టర్‌ గౌతమితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ  ఈనెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల ని ర్మూలనకు ప్రణాళిక రూపొందించామన్నారు  జిల్లాలో 2 లక్షలా 27 వేల 18  మంది ఒకటి నుంచి  19 సం వత్సరాల వయస్సు గల పిల్లలకు మాత్రలు అందజే యాలన్నారు. ప్రతీ ఒక్కరు మాత్రలు తీసుకునే విధం గా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. 15న తీసు కోని వారికి  22వ తేదీన మాత్రలు అందించాలని తెలి పారు. అనంతరం నులిపురుగుల నిర్మూలన మాత్ర లను విడుదల చేశారు.  డీఎంహెచ్‌వో డా. సుబ్బా రాయుడు, ప్రోగ్రాం అధికారి ఫయాజ్‌, మాస్‌  మీడి యా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.  

గ్రామ పంచాయతీలు అవార్డులు సాధించాలి  

గ్రామ పంచాయతీలో జాతీయ స్థాయిలో అవార్డుల ను గెలుపొందాలని కలెక్టర్‌ అన్నారు.  జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మాట్లా డుతూ అవార్డుల ఎంపికలో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు పాల్గొనేలా చూడాలన్నారు.  దరఖా స్తులను ఈ నెల  10 నుంచి అక్టోబర్‌  31 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఉత్తమ పని తీరు కనబరిచిన పంచాయతీలను ప్రోత్సహించే విధం గా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో స్థానికీకరణ, స్థిరమైన అభివృద్ధి, లక్ష్యాల సాధనకు సంబంధించిన రంగాల్లో స్థాయిలను ఆధారంగా అవార్డులను కేటాయిస్తారన్నారు. 9 టీము లలో ఉన్న 113 ప్రశ్నలకు సరిగ్గా సమాధానాన్ని పొం దుపర్చాలని, అన్ని సరిచూసుకున్నాకే సబ్మిషన్‌ చేయా లన్నారు. జిల్లా, మండల అధికారులు, గ్రామీణ ప్రాం తాలను సందర్శించి జిల్లాకు జాతీయ అవార్డు దక్కేలా కృషి చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ గౌతమి, డీపీవో నారాయణరావు, డీఆర్‌డీవో శేషాద్రి, జడ్పీ సీఈవో నరేందర్‌,  ప్రేంకు మార్‌, డీటీడీవో నీలిమ, పాల్గొన్నారు.

కాగా జిల్లా వ్యవసాయాధికారిణి కల్పన హాజరు కాకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆమెకు సమాచా రాన్ని చేరవేశారా అని ప్రశ్నించారు.  అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని,  ప్రభుత్వ పథకాల అమలుపై అప్రమత్తంగా వ్యవహ రించాలని ఆదేశించారు.  

పొగాకు వినియోగం అభివృద్ధికి ఆటంకం  

పొగాకు వినియోగం అభివృద్ధికి ఆటంకమని కలె క్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావే శంలో  డీసీపీ అఖిల్‌ మహజన్‌, ట్రైనీ కలెక్టర్‌ గౌత మితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పొగాకు వినియోగం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. పొగాకు వల్ల కలిగే నష్టాలను  విద్యార్థులకు వివరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పొగాకు నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.  పొగాకు నియంత్రణ దిశగా వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, విద్య, సేల్స్‌టాక్స్‌, కార్మిక, తదితర శాఖలతో జిల్లా స్థాయి కమిటి ఏర్పా టు చేయాలన్నారు. అనంతరం గోడ ప్రతులను ఆవి ష్కరించారు.  డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు, ప్రొగ్రాం అధికారి విజయపూర్ణిమ, నోడల్‌ అధికారి లింగారెడ్డి, మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు,  పాల్గొన్నారు.   

Read more