దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎదగాలి
ABN , First Publish Date - 2022-12-04T00:21:23+05:30 IST
ది వ్యాంగులు తాము ఎందులో తక్కువ కాదని, అందరికంటే ముందుంటామని ఆ త్మస్థైర్యం పెంచుకొని ఎదగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
ఉట్నూర్, డిసెంబరు3: ది వ్యాంగులు తాము ఎందులో తక్కువ కాదని, అందరికంటే ముందుంటామని ఆ త్మస్థైర్యం పెంచుకొని ఎదగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం స్థానిక ఐటీడీఏ కా ర్యాలయం ఆవరణలో నలుగురు దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషక ఆహార విక్ర య కేంద్రాన్ని(గిరిమిలెట్)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు స్వయం ఉపాధి రం గాల్లో రాణించడానికి కృషి చేయాలన్నారు. కుమ్రం భీం ప్రాంగణంలోని వికాసం ప్రత్యేక పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవా నికి హాజరై వికాసం ప్రత్యేక పాఠశాలలోని చిన్నా రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక అవస రాలు గల పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేయ డం హర్షనీయమన్నారు. వికాసం పాఠశాల అభి వృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలను జిల్లా అధికార యంత్రాంగం ద్వారా అంది స్తామని హా మీ ఇచ్చారు. కార్యక్ర మంలో ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.