తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2022-12-31T22:47:43+05:30 IST

బీఆర్‌ఎస్‌ ఏజెంటుగా వ్యవహరిస్తూ పేదల ఇండ్లను ధ్వంసం చేస్తున్న నెన్నెల తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని బీజేపీ నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని  ధర్నా

బెల్లంపల్లి, డిసెంబరు 31: బీఆర్‌ఎస్‌ ఏజెంటుగా వ్యవహరిస్తూ పేదల ఇండ్లను ధ్వంసం చేస్తున్న నెన్నెల తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని బీజేపీ నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ నియోజక వర్గ ఇన్‌చార్జి కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ బొప్పారం గ్రామానికి చెందిన నార పెంటక్క తిరుపతి దంపతులు అన్ని అనుమతులతో ఇల్లు కడుతుంటే తహసీల్దార్‌ పిల్లర్లు పడగొట్టాడని, పెంటక్క పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయగా పోలీసులు ఆపారన్నారు. ఆర్డీవో శ్యామలాదేవికి వినతి పత్రం అందించారు. తిరుపతి, హరీష్‌గౌడ్‌, కేశవరెడ్డి, ప్రకాష్‌, నెన్నెల సర్పంచు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:47:43+05:30 IST

Read more