కలెక్టరేట్‌ ఎదుట న్యాయవాదుల ధర్నా

ABN , First Publish Date - 2022-08-17T05:56:43+05:30 IST

న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్నాలనగేష్‌ అన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట న్యాయవాదుల ధర్నా

ఆదిలాబాద్‌టౌన్‌, ఆగస్టు 16: న్యాయాన్ని రక్షించే న్యాయవాదులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుందని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్నాలనగేష్‌ అన్నారు. మంగళవారం న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో న్యాయవాదిపై దాడి చేయడంలో ఆయన మరణించాడని, న్యాయాన్ని రక్షించే తమకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం  చేశారు. న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని, అప్పటి వరకు ప్రభుత్వంపై ఉద్యమిస్తుంటారన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ నాయకులు, న్యాయవాదులు చందుసింగ్‌, ఉమేష్‌డోలే, నాగేశ్వర్‌, కలీం, అమరేందర్‌రెడ్డి, శ్యాంసింగ్‌, రహీం, రవి కపడే, సంగీత జాదవ్‌, తిలొత్తమ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.

Read more