విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

ABN , First Publish Date - 2022-08-09T03:52:56+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ ప్రైవే టీకరణ బిల్లును ప్రజలు, ఉద్యోగులు వ్యతిరేకించాలని విద్యుత్‌ ఉద్యోగుల జా యింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ బొమ్మ సత్తిరెడ్డి అన్నారు. సోమవారం ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఛార్జీలు పెరిగి సామా న్యులకు భారమవుతుందన్నారు.

విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా
ధర్నా మాట్లాడుతున్న విధ్యుత్‌ ఉద్యోగులు

ఏసీసీ, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్‌ ప్రైవే టీకరణ బిల్లును ప్రజలు, ఉద్యోగులు వ్యతిరేకించాలని విద్యుత్‌ ఉద్యోగుల జా యింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ బొమ్మ సత్తిరెడ్డి అన్నారు. సోమవారం ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల ఛార్జీలు పెరిగి సామా న్యులకు భారమవుతుందన్నారు. ఉద్యోగుల ఆందోళన కారణంగా రోజు వారీ పనులు నిర్వహించడంలో ఆటంకం ఏర్పడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే ప్రజలు సహకరించాలని కోరారు. కన్వీనర్‌ బాపురెడ్డి, నాయకులు రాజ శేఖర్‌, శరత్‌, కొండయ్య, రాంమూర్తి, రాజన్న, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-09T03:52:56+05:30 IST