నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-09-08T06:26:24+05:30 IST

ఈ నెల 15, 22న నిర్వహించే నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని అన్ని శాఖల అధికారులు వంద శాతం పూర్తి చేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశిం చారు.

నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 7 : ఈ నెల 15, 22న నిర్వహించే నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని అన్ని శాఖల అధికారులు వంద శాతం పూర్తి చేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశిం చారు. బుధవారం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు అందజేయాలన్నారు. ప్రణా ళికలు రూపొందించుకోవాలని, లక్ష్యసాధనకు కృషి సలపాలన్నారు. నులిపురుగులు పిల్లల మానసిక, ఆరోగ్య స్థితిపై ప్రభావం చూపుతాయని, ఎలాంటి అశ్రద్ధ చేయరాదన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే నులిపురుగుల సంక్ర మణ అడ్డుకోవచ్చుని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, పి. రాంబాబు, వైద్యాధికారి ధనరాజ్‌, డీఈవో రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more