కంకాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-11-20T22:21:31+05:30 IST

కౌటాల, నవంబరు 20: మండల కేంద్రం లోని కంకాలమ్మ టగుట్టపై నిర్వహించిన జాతరకు భక్తజనం పొటె త్తారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచి భక్తులు తరలివచ్చి అమ్మ వారికి నైవేద్యం వండి సమర్పించారు.

కంకాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

- అలంరించిన ఒగ్గుడోలు నృత్యాలు, శివసత్తుల పూనకాలు

- పట్టువస్త్రాలు సమర్పించిన ప్రముఖులు

- జనసంద్రమైన కౌటాల

కౌటాల, నవంబరు 20: మండల కేంద్రం లోని కంకాలమ్మ టగుట్టపై నిర్వహించిన జాతరకు భక్తజనం పొటె త్తారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచి భక్తులు తరలివచ్చి అమ్మ వారికి నైవేద్యం వండి సమర్పించారు. కంకా లమ్మ జాతర ప్రత్యేకత ఒగ్గుడోలు నృత్యాలు, శివసత్తుల పూనకాలు. మండలంలోని శిర్షా గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు తమ విన్యాసాలతో చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గుట్టపైకి వచ్చే ప్రముఖు లకు ఒగ్గుడోలు నృత్యాలు, పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. అదేవిధంగా శివస త్తులు మండలకేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భాజాభజంత్రీలతో నృత్యాలు చేస్తూ బోనాలు సమర్పించారు. వేలసంఖ్యలో వచ్చిన భక్తులకు ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటుచేయగా, ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘం ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన ప్రముఖులు..

జాతర సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే కోనేరుకోనప్ప సతీమణి రమాదేవి, ఉత్తరప్ర దేశ్‌లోని బృందావన్‌ శివరామస్వామి, మహా రాష్ట్రలోని అకోలకు చెందిన సురేష్‌ నాగేశ్వర స్వామి, జడ్పీ వైస్‌చైర్మన్‌ సతీమణి రుక్మిణి, బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్‌బాబు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ మేయర్‌లు దీకొం డవార్‌, మహారాష్ట్ర హైకోర్టు న్యాయవాది దీపాంజలిమంతనివార్‌, ఎంపీపీలు విశ్వ నాథ్‌, నానయ్య, జడ్పీటీసీ శ్రీదేవి తదితరులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆసిఫాబాద్‌ ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, సీఐబుద్ధేస్వామి, ఎస్సైలు ప్రవీణ్‌, విజయ్‌, వెంకటేష్‌, సనత్‌రెడ్డి, జగదీష్‌, ప్రవీణ్‌, సాగర్‌, సానియాతోపాటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పార్కింగ్‌, బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-11-20T22:21:31+05:30 IST

Read more