‘మనఊరు- మనబడి’తో పాఠశాలల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-09-30T04:05:20+05:30 IST

మనఊరు-మనబడి కార్యక్రమంలో జిల్లాలో మొదటివిడత ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధిపనులు వేగవంతంగా చేయా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం కలెక్ట రేట్‌లో అదనపుకలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి, జిల్లా విద్యాధికారి అశోక్‌తోకలిసి సమీక్షసమావేశం నిర్వహిం చారు.

‘మనఊరు- మనబడి’తో పాఠశాలల అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 29: మనఊరు-మనబడి కార్యక్రమంలో జిల్లాలో మొదటివిడత ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధిపనులు వేగవంతంగా చేయా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం కలెక్ట రేట్‌లో అదనపుకలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయి, జిల్లా విద్యాధికారి అశోక్‌తోకలిసి సమీక్షసమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమంలో జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో మిగిలి ఉన్న పనులను దసరా సెలవులు అయ్యేలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. శిథిలావస్థ లో ఉన్నపాఠశాలల భవనాలను గ్రామ పంచాయతీ తీర్మాణంచేసి తొలగించాలన్నారు.పాఠశాలల్లో విద్యుత్‌, తాగునీరు, ఫర్నీచర్‌ ఏర్పాటు చేయడంతో పాటు భవనాలకు పెయింట్‌ పనులతోసహా పూర్తిచేసే విధం గా ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులు దృష్టి సారిం చాలని తెలిపారు. ఇప్పటివరకు టెండరు పూర్తి కాని పాఠశాలలకు టెండర్‌ ప్రక్రియ పూర్తిచేయాలని తెలి పారు. నవంబరు 14వతేదీ నాటికి జిల్లాలో 50 పాఠశాలలు ప్రారంభించే విధంగా అధికారులు పనులు పూర్తి చేయాలన్నారు.

Read more