బాసర మాస్టర్‌ప్లాన్ సమీక్షించిన దేవాదాయ కమిషనర్
ABN , First Publish Date - 2022-12-16T01:40:24+05:30 IST
బాసర సరస్వతి అమ్మవారి ఆలయ మాస్టర్ ప్లాన్‌పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ బాసరకు వచ్చారు.
బాసర, డిసెంబరు, 15 : బాసర సరస్వతి అమ్మవారి ఆలయ మాస్టర్ ప్లాన్‌పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ బాసరకు వచ్చారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. నదితీరంలో పర్యటించారు. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో చేపట్టవలసిన పనుల గురించి చర్చించారు. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు ఇప్పటి కే ఆలయ అధికారులు టెండర్లు నిర్వహించే ఆర్కిటెక్ సంస్థను ఎంపిక చేశారు. ఆ సంస్థ ప్రతినిధులు సైతం గురువారం బాసర వచ్చి కమిషనర్ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే బాసర సమగ్ర అభివృద్దికి ప్రణాళిక రూపొందుతుందని ఆ తర్వాత టెండర్లు నిర్వహించి అభివృద్ది పనులు ప్రారంభించినున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ సరస్వతి అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిషనర్ వెంట ఆలయ ఈవో విజయరామరావు, చైర్మెన్ శరత్ పాఠక్, దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఏఎస్పీ కిరణ్ ఖారే, తదితరులు ఉన్నారు.