గోదా అమ్మవారికి గాజులతో అలంకరణ

ABN , First Publish Date - 2022-12-31T02:10:31+05:30 IST

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని పొన్కల్‌ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో గోదాదేవి (ఆండా ళ్‌) అమ్మవారిని 5116 గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

గోదా అమ్మవారికి గాజులతో అలంకరణ
పొన్కల్‌లో గోదాదేవికి గాజులతో అలంకరించిన దృశ్యం

మామడ, డిసెంబరు 30 : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని పొన్కల్‌ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో గోదాదేవి (ఆండా ళ్‌) అమ్మవారిని 5116 గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా దేవతామూర్తుల విగ్రహాలను పూలమాలలతో అలంకరించి, అర్చన, అష్టోత్తరములు వంటి ప్రత్యేక పూజలు చేశారు. గోదాదేవి విష్ణు చిత్తుల వారికి పుబ్బ నక్షత్రములో తులసి వనములో లభించిందని, సూర్యోదయానికి ముందే ఆరాధన చేయాలని పలు విషయాలను భక్తులకు ఆలయ అర్చకులు వివరిం చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు విజయసారథి, రామచంద్ర చార్యులు, ఆల య కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T02:10:47+05:30 IST

Read more