రెండవరోజు ఘనంగా సాగిన దత్తజయంతి వేడుకలు
ABN , First Publish Date - 2022-12-07T01:48:08+05:30 IST
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిరామన్న సాయిబాబా ఆలయంలో దత్తజయంతి వేడుకలు ఘనంగా జరుపుకు న్నారు.
నిర్మల్ చైన్‌గేట్, డిసెంబరు 6 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిరామన్న సాయిబాబా ఆలయంలో దత్తజయంతి వేడుకలు ఘనంగా జరుపుకు న్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయిపల్లకి ఊరేగింపు కార్య క్రమం వైభవంగా జరిగింది. పట్టణ పురవీధుల గుండా సాగిన పల్లకి శోభ యాత్రలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు. సాయినాథుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ సింగిల్ ట్రస్ట్ చైర్మన్ లక్కడి జగన్మోహన్‌రెడ్డి మా ట్లాడుతూ... బుధవారం జరిగే దత్త జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాయిదీక్ష సేవా సమితి సభ్యులు పూదరి నరహరి, రామ్‌రెడ్డి సాయిభక్తులు పాల్గొన్నారు.