దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు

ABN , First Publish Date - 2022-10-05T04:10:42+05:30 IST

దళితులు సుస్ధిర ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం దేవాపూర్‌కు చెందిన జాడి వేణు దళితబంధు ద్వారా ఏర్పాటు చేసుకున్న టెంట్‌ హౌజ్‌ను ప్రారంభించి మాట్లాడారు.

దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు
దేవాపూర్‌లో టెంట్‌ హౌజ్‌ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

కాసిపేట, అక్టోబరు 4 : దళితులు సుస్ధిర ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తుందని  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం దేవాపూర్‌కు చెందిన జాడి వేణు దళితబంధు ద్వారా ఏర్పాటు చేసుకున్న టెంట్‌ హౌజ్‌ను ప్రారంభించి మాట్లాడారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తుందన్నారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు రమణారెడ్డి,  రొడ్డ రమేష్‌, శ్రీను, జాడి రాంచందర్‌, తదితరులు పాల్గొన్నారు.  

Read more