అభివృద్ధిని చూడలేకనే విమర్శలు
ABN , First Publish Date - 2022-12-31T22:49:32+05:30 IST
బెల్లంపల్లిలో జరుగుతున్న అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయ కులు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై విమర్శలు చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్‌లు పేర్కొన్నారు.
బెల్లంపల్లి, డిసెంబరు 31: బెల్లంపల్లిలో జరుగుతున్న అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయ కులు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై విమర్శలు చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్‌లు పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో డిపా జిట్ రాని వ్యక్తులు సైతం మంత్రి, ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేస్తున్నా రన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం వంద పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్ బెల్లంపల్లిలో ప్రారంభించామన్నారు. బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.