నేరాలు నియంత్రించడానికే కార్డన్‌సెర్చ్‌

ABN , First Publish Date - 2022-12-30T00:34:15+05:30 IST

నేరాలను నియంత్రించడానికి కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు నిర్మల్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు.

నేరాలు నియంత్రించడానికే కార్డన్‌సెర్చ్‌
అనంతపేట్‌లో పట్టుకున్న వాహనాలతో డీఎస్పీ జీవన్‌రెడ్డి

మామడ, డిసెంబరు 29 : నేరాలను నియంత్రించడానికి కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు నిర్మల్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. గురువారం రోజున మామడ మండలంలోని అనంతపేట్‌ గ్రామంలో కార్డన్‌సెర్చ్‌ నిర్వహిం చారు. సరైన ధ్రువపత్రాలు లేని 73 మోటార్‌ సైకిళ్లను సీజ్‌ చేసి జరి మానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆన్‌లైన్‌ మో సాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ నేరాల బారిన పడకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని, బీమా తదితర ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని కోరారు. ఎటువంటి సహాయం కోసమైనా పోలీసులను సంప్రదించాలని, 100 నెంబ ర్‌కు కాల్‌ చేయాలని తెలిపారు. ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసు కుని శిక్షకుఅర్హులు కావద్దని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం లభి స్తుందని కనుక ఆవేశాలకు గురికావద్దన్నారు. అక్రమ విద్యుత్‌ వాడకుండా ఉండాలని, అక్రమంగా విద్యుత్‌ ఉపయోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెలె ్మట్‌ తప్ప కుండా ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోన్‌ సీఐ రామ్‌ నర సింహారెడ్డి, స్థానిక సర్పంచ్‌ సుమలత తిరుమల్‌, మామడ ఎస్సై గుమ్ముల అశోక్‌, లక్ష్మణచాంద ఎస్సై రాహుల్‌, దిలావర్‌పూర్‌ ఎస్సై గంగాధర్‌, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:34:15+05:30 IST

Read more