కాంట్రాక్టు కార్మికుల రాస్తారోకో

ABN , First Publish Date - 2022-09-18T04:54:21+05:30 IST

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని శనివారం జేఏసీ ఆధ్వర్యంలో మండలంలోని గోలేటి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ

కాంట్రాక్టు కార్మికుల రాస్తారోకో
రాస్తారోకో చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, నాయకులు

రెబ్బెన, సెప్టెంబరు 17: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని శనివారం జేఏసీ ఆధ్వర్యంలో మండలంలోని గోలేటి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్‌, జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం రవీందర్‌ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో సింగరేణి యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం రవీందర్‌,  బీజేపీ అసెంబ్లీ  నియోజకవర్గ కన్వీనర్‌ సొల్లు లక్ష్మి, ఇఫ్టూ నాయకుడు బండారి తిరుపతి, హెచ్‌ఎంఎస్‌ నాయకులు, ఆశోక్‌, సాగర్‌, కాంటాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

Read more