ఘనంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం
ABN , First Publish Date - 2022-12-29T00:07:26+05:30 IST
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవం వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.
నిర్మల్ చైన్‌గేట్, డిసెంబరు 28 : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవం వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండాను ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపు మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాందేడపు చిన్ను పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు జునైద్, మోహిన్, మతిన్, ఫిషర్ మెన్, కాంగ్రెస్ అధ్యక్షులు జింక సూరి, మహిళా నేతలు పాల్గొన్నారు.
భైంసా : కాంగ్రేస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని భైంసాలో ఆ పార్టీ ముథోల్ నియోజక వర్గ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం వేళలో స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రతినిధి ఆనంద్‌రావ్ పటేల్ పార్టీ జెండాను ఎగురవేసి వ్యవస్థాపక దినోత్సవాలను ప్రారంభించారు. అనంతరం పార్టీ ప్రతినిధులు సమీప ప్రాంతాల వాసులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రతినిధి ఆనంద్‌రావ్‌పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశాభ్యున్నతికి అనిర్వచనీయమైన సేవలు అందించిందని పేర్కొన్నారు. ఇందులో పార్టీ ప్రతినిధులు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ఇన్‌చార్జీ షేక్ అంజాద్, కాంగ్రేస్ ప్రతినిధులు హైమద్, భూమన్న, విఠల్‌రావ్, రాజీవ్ దేశాయ్, ఇస్మాయిల్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.