‘పేదలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్’
ABN , First Publish Date - 2022-08-15T03:38:14+05:30 IST
పేదలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆది వారం ఆజాదీకా గౌరవ్ యాత్ర చేపట్టారు. వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో మేలు చేసిందన్నారు.

హాజీపూర్, ఆగస్టు 14: పేదలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆది వారం ఆజాదీకా గౌరవ్ యాత్ర చేపట్టారు. వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో మేలు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు పార్టీని గెలిపించాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజ ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయన్నారు. ఎంపీటీసీలు బాపు, ఒడ్డె బాలరాజు, నాయకులు రాజేశ్వర్‌రావు, రవి, రాజమొగిలి, పాల్గొన్నారు.
ఏసీసీ: ఆజాదీకా గౌరవ్ యాత్ర ఆదివారం మంచిర్యాలకు చేరుకుంది. అనం తరం ఐబీ చౌరస్తా నుంచి లక్షెట్టిపేటకు పాదయాత్ర ప్రారంభమైంది. అంబేద్కర్ విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు పూల మాల వేసి నివాళులర్పించారు.
మందమర్రిటౌన్: దేశ ప్రగతికి పాటు పడింది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేర్కొన్నారు. ఆజాదీకా గౌరవ్ యాత్రలో భాగంగా మం దమర్రిలో పాదయాత్ర చేపట్టారు. జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీతో కలిసి ఓదెలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంతో నష్టం జరిగిందని, ఇందులో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. కాంపెల్లి సమ్మయ్య, మండల భాస్కర్, తేజావత్ రాంబాబు పాల్గొన్నారు. దేశ ప్రతిష్టను దిగజారుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశ సౌభాగ్యం సాధ్యమని చెప్పారు. సొత్కు సుదర్శన్ , బోడ రాజమౌళి పాల్గొన్నారు.
జన్నారం: మండలంలో ఆజాదీకా గౌరవ్ పాదయాత్రను నిర్వహించారు. ఇం దన్పల్లిలో గ్రామ అధ్యక్షుడు నర్సయ్య కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. వెడ్మ బొజ్జు, సుభాష్‌రెడ్డి, ప్రభుదాస్, పసివుల్లా, రాజన్న, ఇందయ్య, మహేష్, నర్సయ్య, పాల్గొన్నారు.