కాంగ్రెస్‌లో గందరగోళం

ABN , First Publish Date - 2022-12-16T23:58:20+05:30 IST

ఏఐసీసీ కార్యక్రమాల అమలు క మిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి అం తరంగం సస్పెన్స్‌ను రేకేత్తిస్తోంది. దీంతో నిర్మల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో గందరగోళం నెలకొంది. పీసీసీ అఽధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన కొద్దిరోజుల నుంచి చేస్తున్న కామెంట్స్‌ ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి.

కాంగ్రెస్‌లో గందరగోళం

అధిష్ఠానం నిర్లక్ష్యంపై గుర్రు

పీసీసీ అధ్యక్షుడిపై పరోక్ష కామెంట్స్‌

డీసీసీ అధ్యక్ష పదవిపై లేని స్పష్టత

నిర్మల్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యో తి): ఏఐసీసీ కార్యక్రమాల అమలు క మిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌ రెడ్డి అం తరంగం సస్పెన్స్‌ను రేకేత్తిస్తోంది. దీంతో నిర్మల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో గందరగోళం నెలకొంది. పీసీసీ అఽధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన కొద్దిరోజుల నుంచి చేస్తున్న కామెంట్స్‌ ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి.

ఇటీవల పీసీసీ కమిటీ ప్రకటన వెలువడిన నాటి నుంచి మహేశ్వర్‌ రెడ్డి దూకుడును పెంచుతుండడం భిన్నాభిప్రాయాలకు కారణమవుతోంది. జిల్లా పార్టీలో బలమైన నేతగానే కాకుండా ఇక్కడి మూడు ని యోజకవర్గాలతో పాటు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ ప్రాంతాల్లో బలమైన అనుచరగణాన్ని కలిగి ఉన్నారు. కొంతకాలంగా అ సంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చే రేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌లో కూడా చేరనున్నట్లు సన్నిహితులు బ హిరంగంగా పేర్కొంటున్నారు.

చారులత రాథోడ్‌, భరత్‌ చౌహన్‌ల రాజీనామాల వెనక ఏలేటీ హస్తం

ఇటీవల పీసీసీ పదవుల వ్యవహారంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజనులకు అన్యాయం జరిగిందంటూ ఉట్నూర్‌ జడ్పీటీసీ చారులత రాథోడ్‌, గిరిజన నాయకుడు భరత్‌ చౌహన్‌లు పార్టీకి రాజీనామా చేయడం వెనక మ హేశ్వర్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన సూచనతోనే పార్టీని వీడి నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఆయన సన్నిహితుడి గా ఉంటూ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహారించిన రామారావు పటేల్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కూడా ఏలేటి పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా నిర్మల్‌ డీసీసీ అఽధ్యక్ష పదవి విషయంలో కూడా పీసీసీ అధిష్ఠానం ప్రకటించిన జాబితాపై సైతం గందరగోళం నెలకొంది. వాస్తవానికి డీసీసీ అధ్యక్షుడిగా డి.ముత్యంరెడ్డి పేరును ఆయన ప్రతిపాదించగా అధిష్ఠానం ఎవరికి తెలియని మరోపేరును ప్రకటించడం గందరగోళ పరిస్థితులకు కారణమవుతోంది. ఈ వ్యవహారం ఆ పార్టీలో నెలకొన్న అయోమయాన్ని అలాగే అసంతృప్తిని బట్టబయలు చేస్తోందంటున్నారు. ఇలా రోజుకో పరిణామానికి తోడు మహేశ్వర్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై చర్చ కొనసాగుతోంది.

టార్గెట్‌ రేవంత్‌..

మొదటి నుంచి రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే మహేశ్వర్‌ రెడ్డి మరోసారి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ రాష్ట్ర అధిష్ఠానంపై చేస్తున్న కామెంట్స్‌ దుమారం రేపుతున్నాయి. మొదట రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ఆ హోదాలో నిర్మల్‌లోనే మొదటి కార్యక్రమం నిర్వహించారు. కాగా, ఇటీవల పీసీసీ కార్యవర్గంలో మహేశ్వర్‌ రెడ్డి అనుయాయులకు ఆశించిన మేర ప్రాధాన్యత లభించకపోవడం తో అసంతృప్తిని వెల్లడిస్తూ విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉట్నూర్‌ ప్రాంతానికి భరత్‌ చౌహన్‌, జడ్పీటీసీ చారులత రాథోడ్‌లు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గందరగోళానికి కారణమైంది.

పార్టీ వీడడంపై ఉత్కంఠ..

పీసీసీ చీఫ్‌పైనే కాకుండా పార్టీ పరిణామాలపై ఘాటు విమర్శలు చేస్తూ తన అసంతృప్తిని బాహటంగా బయటపెడుతున్న మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడంపై ఉత్కంఠ మొదలైంది. కొద్ది రోజు ల క్రితమే ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరు గా సాగిన సంగతి తె లిసిందే. అయితే దీని పై బహిరంగంగా ప్రకటించి తాను కాంగ్రెస్‌ను వీడబోనని అదే పార్టీలో కొనసాగుతానంటూ మీడి యా సాక్షిగా ప్రకటించారు. దీంతో కొంతవరకు ఉత్కంఠకు విరామం పడింది. మళ్లీ పీసీ సీ ఛీప్‌పైన ఆయన కోటరిపైన విమర్శించడం, ఉట్నూర్‌ ప్రాంతానికి చెందిన సీనియర్‌ నేతలను తమ పదవులకు రాజీనామాలు చేయించ డం, డీసీసీ అఽధ్యక్షుడి విషయంలో కూడా అయోమయం సృష్టించడం లాంటి పరిణామాలన్ని ఆయన పార్టీ వీడే విషయంపై ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరబోతున్నారంటూ కొంతమంది ఆయన వర్గీయులే ప్రచారం చేస్తుండడం ప్రాఽ దాన్యతను సంతరించుకుంటోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి బీజేపీ నా యకులు మహేశ్వర్‌ రెడ్డితో టచ్‌లో ఉన్నారని ఆయన వారితో చర్చలు కూడా జరుపుతున్నారన్న ప్రచారం మరోవైపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు ప్రస్తుతం జరుగుతున్న ప్ర చారానికి ఊతమిస్తున్నాయంటున్నారు. కొద్దిరోజుల్లోనే మరోసారి సంచలనం సృష్టించే ప్రకటన జారీ చేసే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలున్నాయి.

Updated Date - 2022-12-16T23:58:21+05:30 IST