నీలగిరి చెట్లను నరికివేయవద్దని ఆందోళన

ABN , First Publish Date - 2022-12-31T22:46:05+05:30 IST

మండల కేం ద్రంలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాంటే షన్‌లో ఉన్న నీలగిరి చెట్ల నరికివేతను నిలిపివేయాలని వన సంరక్షణ సమితి సభ్యులు శనివారం ఆందోళన చేపట్టారు.

నీలగిరి చెట్లను నరికివేయవద్దని ఆందోళన

భీమారం, డిసెంబరు 31: మండల కేం ద్రంలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాంటే షన్‌లో ఉన్న నీలగిరి చెట్ల నరికివేతను నిలిపివేయాలని వన సంరక్షణ సమితి సభ్యులు శనివారం ఆందోళన చేపట్టారు. బీట్‌ ఆఫీసర్‌లతో వాగ్వాదానికి దిగారు. వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో కొన్నే ళ్ళుగా ఫారెస్టు భూముల్లో సుమారు 230 హెక్టార్లలో నీలగిరి చెట్లు నాటమన్నారు. చెట్లను ఇప్పుడు ఫారెస్టు ఆఫీసర్లు తమ కు సమాచారం ఇవ్వకుండా నరికివేసి ప్రభుత్వానికి ఇస్తున్నారని ఆరోపించారు. నీలగిరి చెట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో తమకు యాబై శాతం వాటా ఇస్తామని ఫారెస్ట్‌ అధికారులు హామీ ఇచ్చారని, ఇప్పుడు సమాచారం ఇవ్వకుండా చెట్లను నరికివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై ఫారెస్టు సెక్షన్‌ అధికారి రామకృష్ణ సర్కార్‌ను వివరణ కోరగా వన సంరక్షణ సమితి సభ్యుల ఆధ్వర్యంలో నీలగిరి చెట్లను నాటింది వాస్తవమేనని, చెట్లను నిబంధనల ప్రకారం నరికిస్తున్నామని, తాము ఉన్నతాధికారుల సమావేశాల్లో ఉన్నామని, రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-31T22:46:05+05:30 IST

Read more