ముగిసిన బాస్కెట్‌బాల్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-09-28T03:52:11+05:30 IST

పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు మంగళవారం ముగిశాయి. బాలుర విభాగంలో హైదరా బాద్‌ మొదటి బహుమతి, ములుగు ద్వితీ య, రంగారెడ్డి జట్లు తృతీయ బహుమ తులు సాధించాయి.

ముగిసిన బాస్కెట్‌బాల్‌ పోటీలు
విజేతలకు బహుమతి ప్రధానం చేస్తున్న అధికారులు, నిర్వాహకులు

ఏసీసీ, సెప్టెంబరు  27: పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో  నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు మంగళవారం ముగిశాయి. బాలుర విభాగంలో హైదరా బాద్‌ మొదటి బహుమతి,  ములుగు ద్వితీ య, రంగారెడ్డి జట్లు తృతీయ బహుమ తులు సాధించాయి. బాలికల విభాగంలో ప్రథమ మేడ్చల్‌ మల్కాజిగిరి, ద్వితీయ హైదరాబాద్‌, తృతీయ బహుమతి ములుగు జట్లు కైవసం చేసుకున్నాయి. ముగింపు వేడుకలను బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌  జిల్లా అధ్యక్షుడు డా. చంద్రమోహన్‌గౌడ్‌, చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఆర్డీవో వేణు, ఎంవీఐ వివేకానం దరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, యువ నాయకుడు విజిత్‌రావు పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశాడు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం, రోగ నిరోధక శక్తి పెంపొందు తాయన్నారు. యువత క్రీడల్లో రాణించి జీవితంలో స్ధిరపడాలన్నారు. జిల్లా యువ జన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి,  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భూమేష్‌, నాయకులు కిషన్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.   

Read more