మట్టి గణనాథులను ప్రతిష్ఠించాలి

ABN , First Publish Date - 2022-08-31T06:06:31+05:30 IST

పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రతీఒక్కరూ వినాయక చవితి సందర్భంగా మట్టి గణనాథులను ప్రతిష్ఠించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ కోరారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతుల ను పంపిణీ చేశారు. బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాల యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌తో కలిసి వాటిని అం దజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారి

మట్టి గణనాథులను ప్రతిష్ఠించాలి
మట్టి గణనాథులను పంపిణీ చేస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, ఆగస్టు 30: పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రతీఒక్కరూ వినాయక చవితి సందర్భంగా మట్టి గణనాథులను ప్రతిష్ఠించాలని  కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ కోరారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతుల ను పంపిణీ చేశారు. బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాల యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌తో కలిసి వాటిని అం దజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు కలెక్టర్‌కు మట్టి గణపతిని బహూకరించారు. అనంరతం కలెక్టర్‌ మాట్లాడు తూ కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు గణేష్‌ ఉత్సవాలను సాదాసీదాగా జరుపుకున్నామన్నా రు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహిం చే పెద్ద పండుగ ఇదేనన్నారు. వాతావరణం, నీటి కాలుష్యం లేకుండా విగ్రహాలను ప్రతిష్ఠించా లని కోరారు. పీవోపీ, సింథటిక్‌ విగ్రహాల ఏర్పా టుతో నిమజ్జన సమయంలో నీరు కలుషితం అవుతుందన్నారు. దీన్ని అన్ని మండపాల నిర్వా హకులు గమనించి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠిం చేలా చూడాలన్నారు. పండుగ ఉత్సవాలను ప్ర శాంత వాతావరణంలో జరుపుకుంటూ సంస్కృతి ని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, డీపీ ఆర్‌వో భీంకుమార్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్‌ ఖత్రి, తదితరులు పాల్గొన్నారు.

వైద్యులు అందుబాటులో ఉండాలి

జిల్లాలో సీజనల్‌ వ్యాధులతో పాటు వైరల్‌ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో రిమ్స్‌లో పూర్తిస్థాయి నాణ్యమైన వైద్యం అందించేలా ఇక్కడ అన్ని సౌకర్యాలున్నాయని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మంగళవారం రిమ్స్‌ ఆసుపత్రిని అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌తో కలిసి పరిశీలించారు. చిల్డ్రన్స్‌ వార్డులో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓపీతో పాటు అడ్మిట్‌ అవుతున్న రోగుల వివరాల గురిం చి ఆరా తీశారు. వైరల్‌ జ్వరాలు ప్రబలుతున్నా యని, వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని రిమ్స్‌ డైరెక్టర్‌ డా.జైసింగ్‌రాథోడ్‌కు ఆ దేశించారు. కాగా, సూపర్‌ స్పెషాలిటీ, రిమ్స్‌ ఆ సుపత్రి కార్మికులకు పెండింగ్‌ వేతనాలు చెల్లిం చాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. దీని పై డైరెక్టర్‌తో వివరణ తీసుకున్న కలెక్టర్‌.. బడ్జెట్‌ వచ్చిందని పెండింగ్‌ లో ఉన్న వేతనాలు రెండు రోజుల్లో అందించేలా చూ స్తామని వారికి భరోసా ఇచ్చారు. 

Updated Date - 2022-08-31T06:06:31+05:30 IST