బాల కార్మికులను బడిలో చేర్పించాలి

ABN , First Publish Date - 2022-06-14T04:03:10+05:30 IST

బాల కార్మికులను బడిలో చేర్పించాలని జిల్లా సంక్షేమా ధికారి చిన్నయ్య, అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ వినీతలు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్‌లైన్‌ ఆధ్వర్యంలో సోమవా రం బాల రక్షభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

బాల కార్మికులను బడిలో చేర్పించాలి
వాహనాన్ని ప్రారంభిస్తున్న జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య


ఏసీసీ, జూన్‌ 13: బాల కార్మికులను బడిలో చేర్పించాలని జిల్లా సంక్షేమా ధికారి చిన్నయ్య, అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ వినీతలు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్‌లైన్‌ ఆధ్వర్యంలో సోమవా రం బాల రక్షభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పిల్లలతో పని చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ నేరాలకు పాల్పడిన వారికి 6 నెలల నుంచి రెండేళ్ళ వరకు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా ఉంటుందన్నారు. బాల కార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1098కు సమాచారం అందించాలన్నారు. బాల కార్మిక వ్యవస్ధను నిర్మూలిద్దామనే నినా దంతో కూడిన గోడప్రతులను, దుకాణాల్లో బాల కార్మికులు పనిచేయడం లేదనే స్టిక్కర్లను ఆవిష్కరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఏర్పాటు చేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్‌, చైల్డ్‌ లైన్‌ డైరెక్టర్‌ జిజో ఆంటోని, సహాయ కార్మిక అధికారి రామ్మోహన్‌, చైల్డ్‌ లైన్‌ సమన్వయకర్త సత్యనారాయణ, పరివర్తన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వెంకటగిరి ప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ స్వామి, పాల్గొన్నారు.

Updated Date - 2022-06-14T04:03:10+05:30 IST