చాకలి ఐలమ్మ పోరాటాలు స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-09-27T03:41:56+05:30 IST

భూమి, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణాలో ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని వినిపించి భావితరాల శ్రేయస్సు కోసం పోరాడిన ధీర వనిత అని కొనియాడారు

చాకలి ఐలమ్మ పోరాటాలు స్ఫూర్తిదాయకం
కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌,

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 26: భూమి, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ భారతి హోళికేరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణాలో ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని వినిపించి భావితరాల శ్రేయస్సు కోసం పోరాడిన ధీర వనిత అని కొనియాడారు. రజాకారుల నుంచి పీడిత ప్రజల కోసం ఎన్నో ఉద్యమాల్లో  పాల్గొ ని వీరత్వాన్ని ప్రదర్శించిన ఆమె స్ఫూర్తిని ప్రతీ ఒక్క రు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆమె జీవిత చరిత్ర, ధైర్యసాహసాలు, ఆశయాలను నేటి యువత, విద్యార్థు లు తెలుసుకొని అనుసరించాలన్నారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌,  మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌  పాల్గొన్నారు.  

చాకలి ఐలమ్మ ధైర్య  సాహసాలు  స్ఫూర్తిదాయ కమని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి పేర్కొన్నా రు. జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సీఈవో నరేందర్‌,  డిప్యూటీ సీఈవో లక్ష్మినారాయణ, డీఆర్‌డీఏశేషాద్రి పాల్గొన్నారు. 

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలకంటే శ్వర్‌రావు పేర్కొన్నారు. జన్మభూమినగర్‌లో ఐలమ్మ జయంతిని బీసీ, రజక సంఘాల ఆధ్వర్యంలో నిర్వ హించారు. రాముని చెరువు వద్ద ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజన్న యాద వ్‌, ప్రభాకర్‌, అశోక్‌, ఎల్లయ్య, నరేందర్‌, పాల్గొన్నారు.  

రజక హక్కుల సాధన సంఘం ఆధ్వర్యంలో  పట్ట ణ అధ్యక్షుడు పారుపల్లి శ్రీనివాస్‌, కొత్తకొండ పోషం,  రమేష్‌ల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఐబీ, బైపాస్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నిర్వహిం చారు. రాజయ్య, కుమార్‌, సతీష్‌, రాజం, చందు, మల్లేష్‌, ధర్మయ్య, నరెడ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

Read more