తల్లిపాలే బిడ్డకు అరుదైన ఔషధం

ABN , First Publish Date - 2022-08-04T06:54:29+05:30 IST

తల్లిపాలే బిడ్డకు అరుదైన ఔషధమని ఖానాపూర్‌ మున్సి పల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ అన్నారు.

తల్లిపాలే బిడ్డకు అరుదైన ఔషధం
గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌

ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌

ఖానాపూర్‌ ఆగస్టు 3 తల్లిపాలే బిడ్డకు అరుదైన ఔషధమని ఖానాపూర్‌ మున్సి పల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎనిమి దవ, ఆరవ వార్డుల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవా ల కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిపాల విశిష్టతపై వైద్యాధికారులు స్థానిక మహిళలకు అవగాహన కల్పించారు. నేటి సమాజంలో మార్కెట్‌లోకి వస్తున్న కొత్త కొత్త పాల డబ్బాలకు బదులు శిశు వులకు తల్లిపాలను మాత్రమే తాగించాలన్నారు. చిన్ననాటి నుండి తల్లిపాలు తాగి న శిశువులతో పోలిస్తే డబ్బా పాలు తాగిన వారిలోనే అనారోగ్య సమస్యలు ఎక్కు వ అని తెలిపారు. అనంతరం పలువురు గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, స్థానిక కౌన్సిలర్‌  ఆఫ్రీనా బేగం నాయకులు అమానుల్లాఖాన్‌, కోఆప్షన్‌ సభ్యులు బండారి కిషోర్‌, అంగన్వాడీ టీచర్‌ వరలక్ష్మి, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T06:54:29+05:30 IST