రక్తదాతలు మానవతామూర్తులు

ABN , First Publish Date - 2022-08-18T04:34:03+05:30 IST

రక్తదానం చేసి మరొకరికి ప్రాణ దానం చేసే ప్రతి ఒక్కరూ మానవతామూర్తులనిజిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్‌ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు పాల్గొని రక్తదానం చేసి దాతలకు సర్టిఫికెట్లు అందజేశారు.

రక్తదాతలు మానవతామూర్తులు
రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

 -  జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరీ

- పలు చోట్ల రక్తదాన శిబిరాలు 

\మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు  17:  రక్తదానం చేసి మరొకరికి ప్రాణ దానం చేసే ప్రతి ఒక్కరూ మానవతామూర్తులనిజిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో  నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్‌ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు పాల్గొని రక్తదానం చేసి దాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌  సంస్థ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మహేందర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయనిర్మల, మెడికల్‌ ఆఫీసర్‌ ఫయాజ్‌ఖాన్‌, మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ,  ఆసుపత్రి ఇన్‌చార్జి శ్రీవాణి, హెడ్‌ నర్సు జోస్పిన్‌తమ్మాడి, మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, ఎక్సైజ్‌ అధికారులు మహేందర్‌రెడ్డి, నిర్మలపాటిల్‌, నీరజ, అల్లాడి శ్రీనివాస్‌,  గుడిపేట బెటాలియన్‌ డీఎస్పీ రఘునాథ్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.  

హాజీపూర్‌: మండలంలోని గుడిపేట 13 బెటాలియన్‌ నుంచి 60 మంది పోలీసులు హాజరై రక్తదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ ఎంఐ సురేష్‌, అసి స్టెంట్‌ కమాండెంట్లు శరత్‌కుమార్‌, రఘునాధ్‌చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

చెన్నూరు: పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ ప్రారంభించారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావుదేశ్‌పాండే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనరాంలా ల్‌గిల్డా, వైస్‌ చైర్మన్‌ నవాజ్‌, జెడ్పీటీసీ తిరుపతి, ఎంపీపీ బాపు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సమ్మయ్య, వైద్యాధికారులు సత్యనారాయణ, అరుణశ్రీ, పుట్ట సత్తయ్య, జగదీష్‌, నాందేవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

బెల్లంపల్లి: పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో  నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యామలాదేవి, ఎంపీపీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

జన్నారం: మంచిర్యాల బ్లడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జన్నారంకు చెందిన స్నేహ యూత్‌ సభ్యులు ఎనగందుల సన్ని, రాజు,మర్సుకోల సాయి, స్నేహ యూత్‌ సభ్యులు దుమల్ల జైకుమార్‌లు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వీరిని రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు మదుసూదన్‌రెడ్డి, జన్నారం డాక్టర్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ సతీష్‌ అభినందించారు. 

వేమనపల్లి: చెన్నూరులో నిర్వహించిన శిబిరంలో ఏపీఎం ఉమారాణి, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంపీవో బాపురావు, వైద్యుడు కృష్ణ, హెల్త్‌ అసిస్టెంట్‌ బాపు పాల్గొన్నారు. 

Read more