న్యాయస్థాన భవనానికి భూమి పూజ

ABN , First Publish Date - 2022-09-11T03:48:50+05:30 IST

కన్నాల శివారులో నిర్మించస్తున్న న్యాయ స్థాన భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం తిరుమల ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సద స్సులో మాట్లాడారు. న్యాయస్థానం నిర్మించడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టు పక్కల గ్రామాలతోపాటు జిల్లా ప్రజలందరికి అందుబాటులో ఉంటుందన్నారు. ఏడాది లోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

న్యాయస్థాన భవనానికి భూమి పూజ
భూమి పూజలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్‌రెడ్డి

బెల్లంపల్లి రూరల్‌, సెప్టెంబరు 10: కన్నాల శివారులో నిర్మించస్తున్న న్యాయ స్థాన భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం తిరుమల ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సద స్సులో  మాట్లాడారు. న్యాయస్థానం నిర్మించడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టు పక్కల గ్రామాలతోపాటు జిల్లా ప్రజలందరికి అందుబాటులో ఉంటుందన్నారు. ఏడాది లోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.  జూని యర్‌ సివిల్‌ జడ్జి హిమబిందు, ఆర్డీవో శ్యామలాదేవి, తహసీల్దార్‌ కుమార స్వామి, బార్‌ అసోసియేషన్‌ పట్టణ అధ్యక్షుడు అంకం శివకుమార్‌, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌, ఏసీపీ ఎడ్ల మహేష్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.  

హైకోర్డు జస్టిస్‌కు ఘన స్వాగతం...

నస్పూర్‌: జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన హైకోర్టు జస్టిస్‌ వెంకటేశ్వర్‌రెడ్డికి శనివారం సింగరేణి అతిథి గృహం వద్ద జిల్లా న్యాయ మూర్తులు, అధికారులు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు.  పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి సత్తయ్య, జిల్లా న్యాయ మూర్తి మైత్రేయి, జూనియర్‌ సివిల్‌ జడ్డిలు వైష్ణవి, అసదుల్లా షరీఫ్‌, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహజన్‌, జీఎం సంజీవరెడ్డి,  బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.  

Read more