సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-06-12T03:56:54+05:30 IST

సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో మనోహర్‌ అన్నారు. శనివారం మండలంలోని లోనవెల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో మందుల స్టాక్‌ రిజిస్టర్‌, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పీహెచ్‌సీ సందర్శిస్తున్న డీఎంహెచ్‌వో మనోహర్‌

- డీఎంహెచ్‌వో మనోహర్‌

సిర్పూర్‌(టి), జూన్‌ 11: సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో మనోహర్‌ అన్నారు. శనివారం మండలంలోని లోనవెల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో మందుల స్టాక్‌ రిజిస్టర్‌, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లా డుతూ వర్షాకాలంలో మలేరియా, డయేరియా, సీజనల్‌ వ్యాధుల పట్ల ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలన్నారు. మురికి కాలువలు, గుంతల్లో, బావుల్లో క్లోరినేషన్‌ చేయాలని కార్యదర్శు లకు సూచించారు. ఆయనవెంట డిప్యూటీ డీఎం హెచ్‌వో సీతారాం, డీపీవో ధరంసింగ్‌, డాక్టర్‌ పల్లవీ, హెచ్‌ఏ నర్సయ్య, ఏఎన్‌ఎంలు ఉన్నారు.

Read more