కళాశాలల్లో బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-09-30T03:59:19+05:30 IST

కెరమెరి, దహెగాం, కౌటాల మండల కేంద్రాల్లోని ప్రభుత్వజూనియర్‌ కళాశాలల్లో గురువారం విద్యార్థినులు బతుకమ్మ లను తీరొక్కపూలతో అందంగా తీర్చిదిద్ది ఆడిపాడారు.

కళాశాలల్లో బతుకమ్మ సంబరాలు
కెరమెరిలో బతుకమ్మ ఆడుతున్న విద్యార్థినులు

కెరమెరి/దహెగాం/కౌటాల, సెప్టెంబరు 29: కెరమెరి, దహెగాం, కౌటాల మండల కేంద్రాల్లోని ప్రభుత్వజూనియర్‌ కళాశాలల్లో గురువారం విద్యార్థినులు బతుకమ్మ లను తీరొక్కపూలతో అందంగా తీర్చిదిద్ది ఆడిపాడారు. కెరమెరిలో ప్రిన్సిపాల్‌ పరుశ రాములు, అధ్యాపకులు నవీన్‌రెడ్డి, రాజు, బైరాగి, దహెగాంలో జరిగిన కార్యక్ర మంలో సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ జయలక్ష్మి, జడ్పీటీసీ శ్రీరామరావు, ఎంపీడీవో రాజేశ్వర్‌గౌడ్‌, సంతోష్‌గౌడ్‌, వైస్‌ఎంపీపీ సురేష్‌, సర్పంచ్‌లు, కౌటాలలో జరిగిన కార్యక్రమంలో శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read more