బ్యాంకు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-11-30T22:04:13+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 30: డీసీసీబీ బ్యాంకు భవన నిర్మాణపనులను వేగవంతం చేయా లని డీసీసీబీ చైర్మన్‌ బోజారెడ్డి అన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న డీసీసీబీ బ్యాంకునిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

బ్యాంకు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి


ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 30: డీసీసీబీ బ్యాంకు భవన నిర్మాణపనులను వేగవంతం చేయా లని డీసీసీబీ చైర్మన్‌ బోజారెడ్డి అన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న డీసీసీబీ బ్యాంకునిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయనను ఆసిఫాబాద్‌ పీఏసీఎస్‌చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, వైస్‌చైర్మన్‌ ప్రహ్లాద్‌ ఘనంగా సన్మానించారు. డైరెక్టర్‌ పరమేశ్వర్‌, పురు షోత్తం యాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పెంటయ్య, సీఈవో రమణ సిబ్బంది ఉన్నారు.

సహకార సంఘాల బలోపేతానికి కృషి

బెజ్జూరు/జైనూరు/సిర్పూర్‌(టి): సహ కార సంఘాల బలోపేతానికి కృషి చేస్తా నని డీసీసీబీ చైర్మన్‌ బోజారెడ్డి అన్నారు. గురువారం ఆయన బెజ్జూరు, జైనూరు మండలకేంద్రాల్లోని సహకార సంఘాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ సహకారసంఘాల ద్వారా రైతు లకు రుణాలు అందించడమే లక్ష్యమన్నారు. రుణాలు తీసుకున్న రైతులు వాటిని చెల్లించి తిరిగి తీసు కోవాలన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయ కులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ మాంతయ్య, డీసీసీబీ డైరెక్టర్లు పర మేశ్వర్‌, పురుషోత్తం, ఉమామహేశ్వర్‌, పీఏసీ ఎస్‌ చైర్మన్లు ఓంప్రకాష్‌, తిరుపతిగౌడ్‌, అలీబీన్‌ అహ్మద్‌,పెంటయ్య, సుమన్‌, సతీష్‌,నాహీర్‌ అలీ, జైహింద్‌, శ్రీరాం, అలీ, సీఈవో సంజీవ్‌, మేనేజర్‌ తిరుపతి, జైనూరులో నాయకులు ఇంతియాజ్‌ లాలా, హన్నుపటేల్‌, అంబాజీ, సర్పంచ్‌లక్ష్మణ్‌, ధరంసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం అభినందనీయం

కౌటాల: సిర్పూర్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నదానం నిర్వహించడం అభినందనీయని బోజారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించి మాట్లాడారు. నియోజకవర్గ విద్యార్థులు అదృష్టవంతులన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించి నియోజకవర్గానికి, ఎమ్మెల్యేకు మంచిపేరు తీసుకు రావాలన్నారు. ఎంపీటీసీ మనీష్‌, ఉపసర్పంచ్‌ తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T22:08:58+05:30 IST

Read more