అయ్యప్ప భక్తుల రాస్తారోకో

ABN , First Publish Date - 2022-12-30T22:24:41+05:30 IST

హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన బైరీ నరేష్‌ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాన రహదా రిపై అయ్యప్ప భక్తులు రాస్తారోకో నిర్వహించారు.

అయ్యప్ప  భక్తుల రాస్తారోకో

జన్నారం, డిసెంబరు 30: హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన బైరీ నరేష్‌ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాన రహదా రిపై అయ్యప్ప భక్తులు రాస్తారోకో నిర్వహించారు. నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు గోలి చందు, శేఖర్‌, రమేష్‌, దీక్షాకారులు పాల్గొన్నారు.

ఏసీసీ: హిందూ దేవతలపై, అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై తహసినోద్దీన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ హిందూ దేవత లను, మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్య లు చేస్తున్నారని మండిపడ్టారు. ఇలాంటి వాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాల న్నారు. తులా మధుసుదన్‌రావు, సోమ ప్రదీప్‌ చంద్ర, రవిందర్‌, శ్రీనివాస్‌, సందేష్‌గుప్తా, హరి కృష్ణ, తిరుపతిరెడ్డి, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌: హిందూ దేవతలపై అనుచిత వాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను వెంటనే అరెస్టు చేయాలని రామాలయం, గణపతి ఆలయ అయ్య ప్ప స్వాములు నిరసన తెలిపారు. గురుస్వామి రమేష్‌, శ్రీనివాస్‌లు మాట్లాడుతూ హిందూ దేవ తలను, అయ్యప్ప స్వామిని కించపర్చడం సరికాద న్నారు. అరెస్టు చేయాలని నిరసన చేపట్టారు.

Updated Date - 2022-12-30T22:24:41+05:30 IST

Read more