పోషకాహారంపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-12-16T01:11:46+05:30 IST

పోషకాహారంపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే గర్భిణులు ప్రసవాలు చేసుకోవాలని, అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. వైద్యసిబ్బంది స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దా ర్‌ మోహన్‌సింగ్‌, ఎంఈవో ఉదయ్‌రావ్‌ రాథోడ్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

పోషకాహారంపై అవగాహన కల్పించాలి

ఇచ్చోడ, డిసెంబరు 15: పోషకాహారంపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే గర్భిణులు ప్రసవాలు చేసుకోవాలని, అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. వైద్యసిబ్బంది స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దా ర్‌ మోహన్‌సింగ్‌, ఎంఈవో ఉదయ్‌రావ్‌ రాథోడ్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

పూర్తి సమాచారంతో ఓటరు జాబితాను సిద్ధం చేయాలి

ఆదిలాబాద్‌ టౌన్‌: పూర్తిసమాచారంతో ఓటరు జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు, ఈఆర్‌వోలతో కలిసిన స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2023పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బూత్‌స్థాయి అధికారులు, సూపర్‌ వైజర్లు, ఏఈఆర్‌వోలు ఈఆర్‌వోలు సమష్టి కృషి పర్యవేక్షణలతో తప్పులు లేని ఓటరు జాబితాను తయారుచేయాలని అన్నారు. జాబితా పరిశీలకులు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌ నిబంధనలను అనుసరించి ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు నటరాజ్‌, రిజ్వాన్‌ భాషా షేక్‌, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్‌, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఈఆర్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మన ఊరు-మనబడిపై సమీక్ష

మన ఊరు-మన బడి కింద చేపట్టిన రెనోవేషన్‌ పనులను ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ సిక్నా పట్నాయక్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఇంజనీరింగ్‌ అధికారులు, ఎంపీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పాఠశాల మరమ్మతు పనులను ఆయా ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించి రిపోర్టు సమర్పించాలని అన్నారు. 37 మోడల్‌ పాఠశాలలో 90 శాతం పనులు పూర్తి అయినప్పటికీ 40 శాతం మాత్రమే రికార్డు చేయడం జరిగిందన్నారు. పూర్తి అయిన పనులను సంబంధించిన వివరాలను రికార్డు చేయాలని, రిపోర్టు ఆధారంగా డబ్బులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్‌, అదనపు ఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, జడ్పీ సీఈవో గణపతి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:11:56+05:30 IST