శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి
ABN , First Publish Date - 2022-05-28T04:29:58+05:30 IST
శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని, మీ అభివృద్ధి, సంక్షేమానికి పోలీసు శాఖ మీతో కలిసి పనిచేస్తుందని డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రొట్టెపల్లి పంచాయతీలోని పాత తిర్మలాపూర్‌లో నిర్వహించిన పోలీసులు మీ కోసం కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. దేవాపూర్ నుంచి రొట్టెపల్లి వరకు పోలీసు వాహనంలో వెళ్లి అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు అడవి ప్రాంతం గుండా బైక్‌పై వెళ్లారు. డీసీపీ మాట్లాడుతూ కొలాంగూడ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.

కాసిపేట, మే 27 : శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని, మీ అభివృద్ధి, సంక్షేమానికి పోలీసు శాఖ మీతో కలిసి పనిచేస్తుందని డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రొట్టెపల్లి పంచాయతీలోని పాత తిర్మలాపూర్‌లో నిర్వహించిన పోలీసులు మీ కోసం కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. దేవాపూర్ నుంచి రొట్టెపల్లి వరకు పోలీసు వాహనంలో వెళ్లి అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు అడవి ప్రాంతం గుండా బైక్‌పై వెళ్లారు. డీసీపీ మాట్లాడుతూ కొలాంగూడ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ప్రతీ ఒక్కరు ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకులు కావాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను తప్పనిసరిగా చదివించాలని సూచించారు. అధిక శాతం గిరిజన మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, గిరిజనులు కంటి సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడాన్ని గుర్తించామని, ఇందుకోసం వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజన గూడాల్లో బాల్య వివాహాలు చేస్తున్నారని, దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, బాల్య వివాహాలు చేయవద్దని, బాలికలను చదివించాలని సూచించారు. గిరిజన యువకులు చెడు వ్యసనాలకు బానిస కావద్దని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. పోలీస్ నోటిఫికేషన్‌కు అర్హులైన యువకులకు ఉచిత శిక్షణ అందిస్తుందని, ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు. అనంతరం యువకులకు వాలీబాల్ కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, కొలాం కుటుంబాలకు దుప్పట్లు, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. స్ధానిక గిరిజనులతో కలిసి డీసీపీ సహపంక్తి భోజనం చేశారు. మందమర్రి సీఐ ప్రమోద్‌రావు, దేవాపూర్ ఎస్ఐ విజయేందర్, రొట్టెపల్లి సర్పంచు పెంద్రం కవితహన్మంతు, స్ధానిక నాయకుడు ఆల్క పెద్దులు, టేకం శ్రీను, టేకం శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.