వైభవంగా అష్టోత్తర శత కలశాభిషేకం
ABN , First Publish Date - 2022-08-09T06:56:17+05:30 IST
పవిత్రోత్సవాలను పురస్కరించ కుని సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం పూజలను ఘనంగా నిర్వహించారు.

సూర్యాపేట కల్చరల్, ఆగస్టు 8: పవిత్రోత్సవాలను పురస్కరించ కుని సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం పూజలను ఘనంగా నిర్వహించారు. దేవా లయ ప్రధానార్చకుడు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు స్వామి వారికి ద్వారాతోరణ, ధ్వజకుంభ ఆరాధనలు, మూలమంత్ర హోమములు మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కలశములతో పంచామృతములతో సుగంధ ద్రవ్యాలతో తిరుమంజన స్నపనం నిర్వహించారు. స్వామివారిని పట్టువస్త్రాలతో ఆలంకరించారు. భ. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు శ్రీహరాచార్యులు, హరిచరణ్ ఆచార్యులు, సంకర్షణాచార్యులు, సత్యనారాయణ, కృష్ణయ్య, రవీందర్, శ్రీనివాస్, ఆండాళ్‌గోష్ఠి భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.