ఆశ్రమ పాఠశాల తనిఖీ
ABN , First Publish Date - 2022-12-31T23:17:30+05:30 IST
మండలంలోని తోషం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను శనివారం ఐటీడీఏ డీడీ దిలీప్‌కుమార్ తనిఖీ నిర్వ హించారు.
గుడిహత్నూర్, డిసెంబరు31: మండలంలోని తోషం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను శనివారం ఐటీడీఏ డీడీ దిలీప్‌కుమార్ తనిఖీ నిర్వ హించారు. పరిసర ప్రాంతాలతో పాటు ఉపాధ్యాయ విద్యార్థుల హాజరుశాతం, రికార్డులను, వంటశాలను పరిశీలించారు. అక్షరజ్యోతి కార్యక్రమాన్ని పకడ్బం దీగా చేపట్టాలన్నారు. బోధన, వసతి, భోజనం పట్ల విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదవాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఆయన వెంట హెచ్‌ఎం కనక అభిమాన్ తదితరులున్నారు.