పనిఒత్తిడి వల్లే ఆశా కార్యకర్త మృతి
ABN , First Publish Date - 2022-10-28T01:24:56+05:30 IST
అధికారుల ఒత్తిడి పని భారం వల్లనే బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఆశాకార్యకర్త లావణ్య మృతి చెందిందని ఆరో పిస్తూ గురువారం సాయంత్రం ఆశాకార్యకర్తలు ఆందోళన చేశారు.
నిర్మల్ అర్బన్, అక్టోబరు 27 : అధికారుల ఒత్తిడి పని భారం వల్లనే బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఆశాకార్యకర్త లావణ్య మృతి చెందిందని ఆరో పిస్తూ గురువారం సాయంత్రం ఆశాకార్యకర్తలు ఆందోళన చేశారు. నిర్మల్ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ముథోల్ మండలంలోని వడ్తాల్ గ్రామ ఆశా కార్యకర్త విధులు నిర్వహిస్తున్న సమయం లోనే వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిందని తెలిపారు. నిజామాబాద్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించే సమయంలోనే ఆమె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.