కళాకారులు.. నిండని కడుపులు

ABN , First Publish Date - 2022-10-07T06:14:22+05:30 IST

ఆధ్యాత్మికతకు ఊపిరిపోస్తూ ప్రతిరోజూ అందరూ దండం పెట్టుకునే దేవాలయాలను నిర్మిస్తున్న క ళాకారుల కుటుంబాలు ఇప్పటి వరకు కష్టాలను ఎదురీదుతున్నాయి.

కళాకారులు.. నిండని కడుపులు
పూర్తయిన ఆలయ నిర్మాణం

దేవాలయాల నిర్మాణ కళాకారుల దీనావస్థలు 

అందమైన ఆకృతులు నిర్మిస్తున్నా.. పొట్టగడవని దుస్థితి 

ప్రభుత్వం పట్టించుకోవాలని కళాకారుల వేడుకోలు

నిర్మల్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మికతకు ఊపిరిపోస్తూ ప్రతిరోజూ అందరూ దండం పెట్టుకునే దేవాలయాలను నిర్మిస్తున్న క ళాకారుల కుటుంబాలు ఇప్పటి వరకు కష్టాలను ఎదురీదుతున్నాయి. 

నిర్మల్‌ జిల్లాలో దాదాపు 50 దేవాలయాలకు పైగా నిర్మించిన పలువురు కళాకారుల కుటుంబాలు ఇప్పటికి కష్టాన్ని నమ్ముకొనే జీవిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి రాజమండ్రి, ఏలేశ్వరం ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు నిర్మల్‌ జిల్లాలో పెద్ద ఎత్తున దేవాలయాల నిర్మాణాల పనులను కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంకు చెందిన ఇంటి వెంకటేశం అనే దేవాలయాల నిర్మాణాల కళాకారుడు తన కుటుంబంతో పాటు మరో 50 మంది కళాకారుల కుటుంబాలకు నిర్మాణ పనుల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాడు. అ యితే లక్షల రూపాయల విలువతో దేవాలయాల నిర్మాణాల పనుల ను చేపడుతున్నప్పటికీ ఆ ఆలయాలను నిర్మించే కళాకారుల కుటుంబాలకు మాత్రం సరైన వేతనాలు అందడం లేదన్న ఆరోపణలున్నా యి. ఇటీవల అన్ని దేవాలయాలు వాస్తుతో పాటు శాస్ర్తీయమైన ప ద్ధతిలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చేయి తిరిగిన కళాకారులే శాస్ర్తీయ పద్దతిలో సాంప్రదాయ బద్దంగా దేవాలయాల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న తప్పు దొర్లిన చేసిన నిర్మాణమంతా కూల్చి మళ్లీ ఆ పనిని చేపట్టాలి. ఇలాంటి సున్నితమైన కళాకృత పనులకు అనుభవమే ఆసరా అందిస్తోంది. అలాంటి నిర్మాణ పనులు చేపడుతున్న ఏలేశ్వరానికి చెందిన ఇంటి వెంకటేశం 50 మం ది కళాకారులతో కలిసి పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణ పనుల ను చేపడుతున్నారు. దేవాదాయ శాఖ రూపొందించే అంచనాలు, డిజైన్‌లకు అనుగుణంగా ఈ పనులను చేపడుతూ ఆయన అందరి మన్ననలు పొందుతున్నారు. సిమెంట్‌ పనితో పాటు ప్రధానమైన గోపురాల ని ర్మాణం, విగ్రహాల తయారీ, దేవాలయంలో ని స్థంభాల ఆకృతుల నిర్మాణం, ధ్వజ స్థంభం డిజైన్‌ల వంటి పనులను కళాత్మకంగా నిర్మిస్తున్నారు. తనతో పాటు మరికొంతమందికి ఆయన ఈ దేవాలయాల నిర్మాణాల్లో శిక్షణ కూడా అందిస్తున్నా డు. నిర్మల్‌ జిల్లాలోనే ప్రసిద్ది గాంఛిన మహలక్ష్మి ఆలయ నిర్మా ణాన్ని అత్యంత అద్భుతంగా చేపడుతుండడమే కాకుండా గాంధీచౌక్‌లోని పురాతన హనుమాన్‌ ఆలయం, అలాగే గండి రామన్న ప్రాంతంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలతో పాటు తదితర ఆలయా లను ఆధునిక పద్దతులతో వాస్తు, శాస్ర్తీయతలను జోడించి చేపడుతున్న నిర్మాణాలు అందరి మన్ననలు అందుకుంటున్నాయి. కొద్ది రోజుల్లోనే ఈ ఆలయాల పనులన్ని పూర్తికానుండడంతో వాటి ప్రారంభ కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 

టెంపుల్‌ కారిడార్‌లో భాగంగా..

నిర్మల్‌ జిల్లాను టెంపుల్‌ టూరిజం కారిడార్‌గా తీర్చిదిద్దే యోచనతో మంత్రి దేవాలయాల నిర్మాణాలపై దృష్టి సారించారంటున్నారు. బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి మొదలుకొని కదిలి పాపహరేశ్వరాలయం, కాల్వ లక్ష్మి నర్సింహ స్వామి ఆలయంతో పాటు నిర్మ ల్‌లోని హరిహరక్షేత్రం, నందిగుండం దుర్గామాత ఆలయం, గండి రామన్న సాయిబాబా మందిరం, అడెల్లి మహా పోచమ్మ ఆలయం, నిర్మల్‌లోని బంగల్‌పేట్‌ మహలక్ష్మి ఆలయం, మామడ మండలంలో ని బూరుగుపల్లి రాజేశ్వర స్వామి ఆలయం, లక్ష్మణచాంద మండలంలోని బాబాపూర్‌ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ముజ్గి మల్లన్న ఆలయాలను కలుపుతూ ఈ టెంపుల్‌ టూరిజం కారిడార్‌ను రూపకల్పన చేస్తున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకులను జిల్లాకు రప్పించే చర్య ల్లో భాగంగా ఈ యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. దీనికి మం త్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఈ కొత్త కార్యచరణను వేగంగా అమలయ్యేలా చేస్తున్న కృషి ప్రశంసలు అందుకుంటోంది.

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అండతో..

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో నిర్మల్‌ నియోజకవర్గంలో దాదాపు రూ. 100 కోట్ల వ్యయం చేసి 500 దేవాలయాల నిర్మాణాలను చేపట్టారు. ఇందులో అనేక చారిత్రక ఆలయాల పునరుద్దరణ పనులతో పాటు కొత్త ఆలయాల నిర్మాణాలు కూడా ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను తొలగించి 

వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తన పరిధిలోని సీజీఎఫ్‌ (కామన్‌ గుడ్‌ ఫండ్‌) నిధులతో ఆలయాల నిర్మాణాలకు భా రీగా నిధులు మంజూరయ్యేలా చూస్తున్నారు. నిర్మల్‌ నియోజకవర్గా న్ని రాష్ట్రంలోనే ప్రధాన ఆఽధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న యోచన తో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గత మూడేళ్లుగా నిర్మల్‌ నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణాలు వేగం గా కొనసాగుతున్నాయి. 

కళాకారుల కడుపు నింపని నిర్మాణాలు..

జీవన వ్యయం పెరిగిపోవడం, కూలీ రేట్లు సరిపోకపోవడంతో దే వాలయాలను నిర్మిస్తున్న కళాకారులకు, ఈ నిర్మాణాల్లో భాగస్వామ్యం అవుతున్న కూలీలకు అందించే వేతనాలు గిట్టుబాటు కావడం లేదంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సున్నితమైన దేవత విగ్రహా లు, స్థంభాలపై దేవుళ్ల ఆకృతులు, అలాగే గోపురాల నిర్మాణాలు వంటి పనులను అత్యంత ఏకాగ్రతగా చేపట్టాల్సి ఉంటుందంటున్నారు. మా మూలు భవన నిర్మాణాలకు, దేవాలయాల నిర్మాణాలకు ఎంతో వ్య త్యాసం ఉంటుందని ఇలాంటి కళాత్మకతతో కూడిన సున్నితమైన ని ర్మాణాలు చేపడుతున్నప్పటికీ తమ కడుపులు మాత్రం పూర్తిగా నిండ డం లేదని కళాకారులు వాపోతున్నారు. దేవాదాయ శాఖ ఇలాంటి దే వాలయాల నిర్మాణాల కళాకారులు గుర్తించి వారికి అదనపు సౌకర్యా లు, ఇతర రాయితీలు కల్పించాలని కోరుతున్నారు.

Read more