మాతా, శిశు రక్షణకు పకడ్బందీ చర్యలు

ABN , First Publish Date - 2022-08-10T06:09:42+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో మాతా, శిశు మరణాలు జరగకుండా నివారించడానికి మాతా, శిశు రక్షణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టనున్నామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో

మాతా, శిశు రక్షణకు పకడ్బందీ చర్యలు
ఉట్నూర్‌లో భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న ఐటీడీఏ పీవో, ఏఎస్పీలు

ఏజెన్సీలో మరణాల నివారణ : కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ 

జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఉట్నూర్‌, ఆగస్టు 9: ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో మాతా, శిశు మరణాలు జరగకుండా నివారించడానికి మాతా, శిశు రక్షణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టనున్నామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక  కుమ్రం భీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఆదివాసీ గిరిజను ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతియేటా వర్షాకాలంతో పాటు ఇతర సమయాలలోనూ ప్రసవ మరణాలు గిరిజన ప్రాంతాలలో జరగుతున్నందున  ఆరు నెలల ముందు నుంచి గర్భిణుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నా రు. ప్రసవ తేదీలను గుర్తించి గర్భిణులను ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన ప్రసవ నిరీక్షణ గదులకు చేరవేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా అవస రమైన సీహెచ్‌సీలో కూడా ప్రసవ నిరీక్షణ గదులను ఏర్పాటు చేస్తామని అన్నారు. రెండేళ్ల విరామం తరువాత స్వేచ్ఛగా కరోనా లేకపోవడంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఉ మ్మడి జిల్లాలోని ఐటీడీఏ పరిదిలో 50 శాతం ఆదివాసీ గిరిజనులు ఉన్నా రని, వారికి అవసరమైన విద్య, వైద్య రంగాలపై ప్రత్యేకదృష్టి పెట్టడం ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధుల నుంచి గిరిజనులను కాపా డగలిగామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో గత ఏప్రిల్‌ నుంచి సీజనల్‌ వ్యాధుల నియంత్రణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపారని అన్నారు. ఇంకా వర్షాకాలం ఉన్నందున గ్రామా లలో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉండాలన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలందరూ సంగీతానికి, నృత్యాని కి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.  గిరిజన గ్రామాలలో చిన్నవర్షాలకే రోడ్లు తెగిపోయి రాకపోకలు స్తంభిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆదేశా ల మేరకు అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మాద్యమాన్ని ప్రవేశ పెట్టడం జరి గిందని, అవసరమైన చోట స్పోకెన్‌ ఇంగ్లీష్‌ శిక్షణను ఐటీడీఏ ద్వారా ప్రా రంభిస్తామన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని అన్నారు. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవం కార్యక్రమాలు ప్రతీ గ్రామంలో నిర్వహించాలన్నారు. ప్రపంచ  ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆదివాసీ గిరిజనులు ప్రదర్శించిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముందుగా ఆదివాసీ గిరిజనులు ఉట్నూర్‌ పట్ణణంలో ర్యాలీ నిర్వహించారు. కుమ్రంభీం విగ్రహానికి పూలమాలలు  వేసి, అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.  ఆదివాసీ మహిళలతో కలిసి కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ దింసా నృత్యాన్ని  చేసి ఆదివాసీలను సంబుర పరిచారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో అరు ణ్‌రెడ్డి, ఎఎస్పీ హర్షవర్ధన్‌, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌  కనక లక్కెరావు, డీడీ దిలీప్‌కుమార్‌, సీఐ సైదారావు, ఎంపీపీ పంద్రజైవంత్‌రావు, మాజీ మంత్రి గోడాం నగేష్‌,  జిల్లా మేడి  మెస్రం దుర్గు, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, మెస్రం మనోహర్‌, ఆత్రం భుజంగ్‌రావు, ఆత్రం సుగుణ, పెందూర్‌ పుష్పరాణి, కనక తుకారాం, కుమ్ర విఠల్‌, అర్కదేవ్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 

ఆదిలాబాద్‌ టౌన్‌: ఆదివాసీలు అన్ని రంగాల్లో అభ్యున్నతి పథంలో నడిచేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆదివాసీ నాయకులతో కలిసి ఆదివా సీల ఆరాధ్య దైవం కుమరంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడారు. అలాగే, కుమరంభీం ఆశయ సాధనకు ప్రత ఒక్కరు కృషి చేయాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పూసం సచిన్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం బ స్టాండ్‌ ఎదురుగా ఉన్న కుమ్రంభీం, రాంజీ గోండు విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. 

అలాగే, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని  జిల్లాలోని నార్మూర్‌, గాదిగూడ మండలాల్లో ఆదివాసీలు ఘనంగా నిర్వహించుకున్నారు.  అలాగే, ఇంద్రవెల్లి, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌, భీంపూర్‌, సిరికొండ, గుడిహత్నూర్‌తో పాటు తలమడుగు మండలంలోని గిరిజన గ్రామాల్లో మంగళవారం ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ గిరిజన గ్రామాల్లో ఆదివాసీ పోరాట యోధుడు కొము రంభీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ జెండాను ఎగుర వేశారు. ఇందులో ఆదివాసీ గిరిజన సంఘాల సభ్యులు, నాయకులు, తదిత రులు పాల్గొన్నారు.

Read more