కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2022-03-17T04:28:44+05:30 IST

ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకుంటామని, సెర్ప్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తామని ప్రకటించిన సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో ఉద్యోగులు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
బెల్లంపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మెప్మా ఉద్యోగులు

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 16: ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకుంటామని, సెర్ప్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తామని ప్రకటించిన సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో ఉద్యోగులు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భూపతి బ్రమ్మయ్య, సహాయ కార్యదర్శి రాజ్‌కుమార్‌, కోశాదికారి జగ్జీవన్‌రామ్‌, రాజునాయక్‌, రాజలింగు, సంతోష్‌, డీపీఎంలు రమేష్‌, స్వర్ణలత, సిబ్బంది పాల్గొన్నారు.
హాజీపూర్‌: మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి సెర్ప్‌, ఐకేపీ సిబ్బంది బుధవారం క్షీరాభిషేకం చేశారు. జిల్లా ఐకేపీ సంఘం అధ్యక్షుడు భూపతి బ్రహ్మయ్య, ఏపీఎం శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ రమేష్‌, సిబ్బంది కమలాకర్‌, కృప, జలజ, సువర్ణ, సత్యవతి, అమృత, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌ల ఆధ్వర్యంలో మెప్మా ఉద్యోగులు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఎంసీ దుర్గయ్య, సీవో రామకృష్ణ, డీఈవో రుక్సానా, కౌన్సిలర్‌లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
తాండూర్‌: ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ తాండూర్‌ మండల కేంద్రంలో బుధవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ ప్రణయ్‌కుమార్‌, ఎంపీటీసీలు సిరంగి శంకర్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో తాండూర్‌ ఇన్‌చార్జి సర్పంచు నవీన్‌కుమార్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
నెన్నెల:  మండల కేంద్రంలో బుధవారం సెర్ప్‌ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌, పంచాయతిరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీపీఎం వేణు, నెన్నెల, భీమిని ఏపీఎంలు విజయలక్ష్మి, పంజాల ప్రకాష్‌గౌడ్‌, సీసీలు గంగరాజు, శ్రీనివాస్‌, సువర్ణ, వసంత్‌, సతీష్‌, సౌజన్య పాల్గొన్నారు. అలాగే ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేధికలో సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు సాగర్‌గౌడ్‌,  పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల మల్లేష్‌, నాయకులు భీమాగౌడ్‌, సింగతి రాంచెందర్‌, సంతోషం ప్రతాప్‌రెడ్డి, తోకల తిరుపతి, సర్పంచ్‌ గొర్లపల్లి బాపు తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు చెన్నూరి శేఖర్‌, రాజన్న, సమ్మయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి: సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించిన సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఫీల్డ్‌ అసిస్టెంఒ కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఏలు సుదర్శన్‌గౌడ్‌, దామోదర్‌, శ్రీనివాస్‌, భాగ్య, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
దండేపల్లి:  దండేపల్లి  మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ముత్తె రాజన్న, కోర్విచెల్మ ఉపసర్పంచ్‌ ముద్దసాని తిరుపతి, ఫీల్ట్‌ అసిస్టెంట్లు సతీష్‌, ప్రేంసింగ్‌, సత్యం, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
జైపూర్‌:  మండల సమాఖ్య కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఏపీఎం రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో  సెర్ప్‌ ఉద్యోగులు  క్షీరాభిషేకం  చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ప్‌ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు.
కోటపల్లి: ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ వెలుగులు నింపారని మాజీ ఎంఎల్‌సీ పురాణం సతీష్‌కుమార్‌ అన్నారు.  మంల కేంద్రంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లతో కలిసి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మరో వైపు మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు ఎంపీడీవో భాస్కర్‌, ఏపీవో వెంకటేశ్వర్లుతో కలిసి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
జన్నారం: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో  కేసీఆర్‌ చిత్రపటానికి ఎంపీపీ సరోజన, వైస్‌ ఎంపీపీ వినయ్‌ల ఆధ్వర్యంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు క్షీరాభిషేకం నిర్వహించారు. కో ఆప్షన్‌ మున్వర్‌ ఆలీఖాన్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్టు పాల్గొన్నారు.
భీమిని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల మండల అధ్యక్షుడు జనగామ మల్లేష్‌, ప్రసాద్‌, సాయిరాం, కోటేష్‌, లీలావతి, సత్యనారాయణ పాల్గొన్నారు.
భీమారం: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు నక్క రాజన్న, నాయకులు సుధాకర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ మండల నాయకులు దాసరి మధునయ్య, రాము, జనంపెల్లి సమ్మయ్య, ఎండీ బాబర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్‌: ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.  కార్యక్రమంలో జెడ్పీటీసీ వేల్పుల రవి, ఎంపీపీ గుర్రం మంగశ్రీనివాస్‌గౌడ్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈద లింగయ్య, టీఆర్‌ఎస్‌ మండల అద్యక్షుడు సంజీవరావు, వైస్‌ ఎంపీపీ రాజ్‌కుమార్‌, సర్పంచులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అలాగే సెర్ఫ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించినందున  కేసీఆర్‌ చిత్రపటానికి మండల ఐకేపీ కార్యాలయంలో క్షీరాభిషేకం చేశారు. ఏపీఎం లలితకుమారి, చారి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T04:28:44+05:30 IST