గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2022-10-05T04:13:43+05:30 IST

జిల్లా కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం మహాసభ మహిళా విభాగం, వాసవి క్లబ్‌, ఆవోపా ఆధ్వర్యంలో మంగళవారం గాంఽధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం
గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న ఆర్యవైశ్య సంఘం సభ్యులు

ఏసీసీ, అక్టోబరు  4 : జిల్లా కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం మహాసభ  మహిళా విభాగం, వాసవి క్లబ్‌, ఆవోపా ఆధ్వర్యంలో మంగళవారం గాంఽధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.  కలకత్తాలోని రూబీ క్రాసింగ్‌ వద్ద అఖిల భారత హిందూ మహాసభ పేరిట ఏర్పాటు చేసిన మండపంలో దుర్గా మాత విగ్రహం వద్ద  మహిషాసూరుని స్థానంలో మహాత్మున్ని పోలిన బొమ్మ పెట్టడంపై వారు నిరసించారు. ఘటనకు పాల్పడిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ముక్త శ్రీనివాస్‌, సిరిపురం శ్రీనివాస్‌, మాదంశెట్టి సత్యనారాణ, కొండ చంద్రశేఖర్‌, కేశెట్టి వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.   

Read more