గ్రూపు-1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-09-21T05:32:28+05:30 IST

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూపు-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అధికారులను ఆదేశించా రు. అక్టోబర్‌ 16వ తేదీన నిర్వహించే గ్రూపు-1 పరీక్ష నిర్వహణకు సంబంధించి సంబంధిత అధి కారులతో మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాం బర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో గ్రూపు -1

గ్రూపు-1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలి

ఆదిలాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 20: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూపు-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అధికారులను ఆదేశించా రు. అక్టోబర్‌ 16వ తేదీన నిర్వహించే గ్రూపు-1 పరీక్ష నిర్వహణకు సంబంధించి సంబంధిత అధి కారులతో మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాం బర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో గ్రూపు -1 పరీక్ష నిర్వహణకు 19 కేంద్రాల్లో 262 గదుల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకో వాలని సూచించారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో అవసరమైన తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, అన్ని గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదే శించారు. ఆయా కేంద్రాల ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యంతో మాట్లాడి తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటుకు శుక్రవారంలోగా చర్యలు తీసుకుం టూ నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో మెడి కల్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు జర గకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను స్పష్టం చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ విధించాలని సూచించారు. వివిధ ప్రాం తాల నుంచి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష సమయానికి ముందే బస్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని, పరీక్ష నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని అ న్నారు. ప్రశ్న పత్రాలను ఖజానా కార్యాలయంలో భద్రపరచాలని సూచిం చారు. జిల్లాకేంద్రంలో 19 పరీక్ష కేంద్రాల్లో సుమార్‌ 6200 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో వసతులకు సంబంధించి ఆయా కేంద్రాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయాలని, పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సహకారంతో ఏర్పాట్లు చేపట్టా లని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.నటరాజ్‌, అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఉత్తమ్‌, జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత, ఇన్‌చార్జి డీఆర్‌వో అరవింద్‌ కుమార్‌, జిల్లా ఇంటర్మీడియేట్‌ విద్యా శాఖ అధికారి రవీందర్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకురాలు వర్ణ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్‌ సాధన పాల్గొన్నారు.

Updated Date - 2022-09-21T05:32:28+05:30 IST