స్వగ్రామానికి చేరుకున్న అలేఖ్య
ABN , First Publish Date - 2022-03-05T07:13:12+05:30 IST
మండల కేంద్రానికి చెందిన చేపూరి అలేఖ్య ఉక్రెయి న్లో వైద్యవిద్యనభ్యసిస్తుంది.
కుంటాల, మార్చి 4 : మండల కేంద్రానికి చెందిన చేపూరి అలేఖ్య ఉక్రెయి న్లో వైద్యవిద్యనభ్యసిస్తుంది. శుక్రవారం ఉదయం అలేఖ్య స్వగ్రామానికి చేరు కుంది. ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అలేఖ్యతో పాలు 150 మంది విద్యార్థులు అక్కడ ఏర్పాటు చేసిన బంకర్లలో తలదాచుకొని, అనం తరం రుమేనియాకు చేరుకున్నారు. రుమేనియా నుంచి భారత ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన విమానాల్లో ఢిల్లీకి చేరుకోగా కేంద్రమంత్రులు స్వాగతం పలి కారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విద్యార్థులకు భోజనం, సేద తీరడానికి వసతి కల్పించారు. శుక్రవారం ఉదయం అలేఖ్య స్వంత గ్రామానికి చేరుకోగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, కుంటాల ఉన్న పాఠశాల విద్యార్థులు ఆమెను స్వాగతించారు. తమ కూతురు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తల్లి దండ్రులు సంతోషించారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో విమానాలను రంగంలోకి దించి ప్రభుత్వం విద్యార్థుల తరలింపుకు సహకరించిందని, అలేఖ్య కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.