వంతెన పనులను పరిశీలించిన ఏఐజీఎఫ్‌ అధికారి

ABN , First Publish Date - 2022-12-07T22:06:31+05:30 IST

వాంకిడి, డిసెంబరు 7: మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులోని గణేష్‌పూర్‌ సమీపంలో చేపడుతున్న నాలుగు వరుసల జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వైల్డ్‌ లైఫ్‌క్రాసింగ్‌(ఈసీవో) వంతెన పనులను ఏఐజీఎఫ్‌(అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) మంజునాథ్‌ పరిశీలించారు.

వంతెన పనులను పరిశీలించిన ఏఐజీఎఫ్‌ అధికారి

వాంకిడి, డిసెంబరు 7: మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులోని గణేష్‌పూర్‌ సమీపంలో చేపడుతున్న నాలుగు వరుసల జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వైల్డ్‌ లైఫ్‌క్రాసింగ్‌(ఈసీవో) వంతెన పనులను ఏఐజీఎఫ్‌(అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) మంజునాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఏ అధికారులతో వంతెన నిర్మాణ పనులను అడిగి తెలుసు కున్నారు. వన్యప్రాణులు వంతెన కింద భాగం నుంచి వెళ్లడానికి తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. వంతెనను వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో వినోద్‌కుమార్‌, ఎఫ్‌ఆర్వో అప్పలకొండ, డిప్యూటీఆర్‌వో ప్రవీణ్‌కుమార్‌, ఎఫ్‌ఎస్‌వో సత్యనారాయణ, ఎఫ్‌బీవోలు కామరాజ్‌, సుమన్‌, ఉమారాణి, ఎన్‌హెచ్‌ఏ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:06:33+05:30 IST