ఆసిఫాబాద్‌ జిల్లాలో అటకెక్కిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం

ABN , First Publish Date - 2022-12-31T23:04:15+05:30 IST

బెజ్జూరు, డిసెంబరు 31: వ్యవసాయ యాంత్రీకరణ పథకం అటకెక్కింది. నారలుగున్నరేళ్లుగా ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని పెంచి అన్నదాతలకు కూలీల ఖర్చు భారాన్ని, సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన ఈ పథకం పత్తాలేకుండా పోయింది.

ఆసిఫాబాద్‌ జిల్లాలో అటకెక్కిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం

- నాలుగున్నరేళ్లుగా ఇబ్బంది పడుతున్న రైతులు

- సొంతంగా కొనుగోలు చేయలేక అవస్థలు

- పునరుద్దరించాలని వేడుకోలు

బెజ్జూరు, డిసెంబరు 31: వ్యవసాయ యాంత్రీకరణ పథకం అటకెక్కింది. నారలుగున్నరేళ్లుగా ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని పెంచి అన్నదాతలకు కూలీల ఖర్చు భారాన్ని, సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన ఈ పథకం పత్తాలేకుండా పోయింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నార్మల్‌ స్టేట్‌ ప్లాన్‌(ఎన్‌ఎస్‌పీ)తో పాటు రాష్ర్టీయ కృషి వికాస్‌ యోజన(ఆర్‌కేవీవై)ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా రాయితీపై రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలు, పరికరాలు మంజూరు చేసేవి. 2017-18సంవత్సరం వరకు ఈ పథకం అమలులో ఉంది. ఆ తర్వాత 2018-19నుంచి ఆపేశారు. దీంతో రైతులు ఎక్కువ మొత్తం చెల్లించి యంత్రాలు, పరికరాలు కొను క్కోవాల్సి వస్తోంది. ఆర్థికస్థోమత లేని వారు అలాగే నెట్టు కొస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబం ధించి ప్రభుత్వం 2020-21బడ్జెట్‌లో రూ.1500కోట్లు కేటాయిస్తున్నట్లు చూపించింది తప్ప ఖర్చు చేయలేదు. దీనికి సంబంధించి ఎలాంటి విధివిధానాలను ఖరారు చేయకపోవడంతో ఆ నిధులన్నీ వృథాగా ఉండిపోయాయి.

పెట్టుబడి భారం తక్కువ..

వ్యవసాయంలో యంత్రాలను వినియోగించడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా అవుతుంది. కూలీల ద్వారా వారం రోజుల్లో జరిగే పని యంత్రాల వల్ల ఒక్కరోజులో పూర్తవుతుంది. సమయం ఆదా అవడం వల్ల రైతులు వేరే పనిలో నిమ గ్నమయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో యంత్రాల వినియోగం బాగా పెరిగింది. 10ఏళ్ల క్రితంతో పోలిస్తే మరీ ఎక్కువైంది. రైతులు పూర్తిగా యంత్రాలపైనే ఆధార పడుతున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులు సైతం అప్పులు తెచ్చి యంత్రాలు, పరికరాలను సమకూర్చు కోవడంపై దృష్టి సారిస్తున్నారు.

రైతుల నుంచి వినతులు..

సబ్సిడీ యంత్రాల కోసం రైతులు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా పథ కాన్ని పునరుద్దరించి వచ్చే వేసవి నాటికి పరికరాలను అందించాలని వేడుకుంటున్నారు. కూలీలతో వ్యవసాయం చేయాలంటే ఖర్చు భరించలేమని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. అలాగని పూర్తి ధర చెల్లించి యంత్రాలు కొను గోలు చేసే ఆర్థిక స్థోమత తమకు లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంలో రైతులే కాకుండా ప్రజాప్రతినిధుల నుంచి కూడా తమకు వినతులు వస్తు న్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

అన్నదాతల ఎదురుచూపులు..

పథకం నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడు అమలవు తుందోనని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. వ్యవ సాయ పరికరాలపై ఎస్సీ, ఎస్టీలకు 95శాతం, మిగిలిన వర్గాలకు 50శాతం రాయితీ ఇచ్చేవారు. ట్రాక్టర్లతో పాటు పొలం దున్నడానికి ఉపయోగపడే కల్టివేటర్‌, రొటోవేటర్‌, పవర్‌ టిల్లర్‌, వరినాటు యంత్రాలు, పవర్‌ వీడర్‌, పురు గుల మందు పిచికారి యంత్రాలు, ఇతర వ్యవసాయ అనుబంధ పరికరాలను రాయితీపై అందించేవారు. ప్రస్తుతం ఈ పథకం అమలులో లేకపోవడంతో రైతులు మొత్తం ధర చెల్లించి కొనాలంటే ఇబ్బంది పడుతున్నారు. దీంతో రైతులు పెట్టుబడి భారం మళ్లీ పెరిగింది. ఒక్కో వ్యవసాయ పరికరాన్ని బయట కొనుగోలు చేయాలంటే రైతులకు పెద్దమొత్తంలో ఖర్చు అవుతోంది. కల్టివేటర్‌ను బయట తయారు చేయించాలంటే రూ.30నుంచి 50వేలు ఖర్చు అవుతుంది. రొటోరేటర్‌ కొనాలంటే రూ.లక్ష వరకు అవుతుంది. పురుగుల మందు పిచికారీ యంత్రాలు ధర మార్కెట్‌లో రూ.3000నుంచి రూ.10వేల వరకు అవు తుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు జరి గితే ఇవన్నీ సగం ధరలకు వస్తాయి. ఈ పథకం ప్రస్తు తం అమలు కాకపోవడంతో మొత్తం భారం రైతులపై పడుతోంది.

రైతులు అడుగుతున్నారు..

- రాజులనాయుడు, ఏడీఏ, పెంచికలపేట

వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రస్తుతం అమ లులో లేదు. గతంలో వ్యవసాయ యాంత్రీకరణ పథ కంలో భాగంగా రైతులకు 50శాతం రాయితీపై ట్రాక్టర్లు, కల్టివేటర్లు, రొటోవేటర్లు, పవర్‌ టిల్లర్‌, పవర్‌ వీడర్‌, స్ర్పేయర్లు వంటి పరికరాలను అందించాం. నాలుగేళ్లుగా ఈ పథకం ఆగిపోవడంతో రైతుల నుంచి వినతులు, డిమాండ్లు వస్తున్నాయి. ఈ పథకం అమలుకు సంబం ధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి.

సబ్సిడీ పరికరాలు అందజేయాలి..

- ఏనుక శ్రీహరి, రైతు సలుగుపల్లి

సబ్సిడీ యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ఉన్న మాదిరిగానే రైతులకు అన్నిరకాల పరికరాలను అందజేసి ఆదుకోవాలి. పరికరాలను బయట మార్కెట్‌లో కొనుగోలు చేయడం భారంగా మారింది. బయట కొనుక్కోవడం ఖర్చుతో కూడుకొని ఉంది. రైతుల శ్రేయస్సు కోసం పరికరాలు ప్రభుత్వమే అందించే ఏర్పాటు చేయాలి.

Updated Date - 2022-12-31T23:04:15+05:30 IST

Read more