సీఎం ప్రకటనపై ఆదివాసీల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-09-19T05:53:13+05:30 IST

లంబాడాలను ఎస్టీ జాబితాలోంచి తొలగించకుం డా సీఎం కేసీఆర్‌ రిజర్వేషన్‌లు పెంచుతామనడంపై ఆదివాసీ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం ప్రకటనపై ఆదివాసీల ఆగ్రహం

ఉట్నూర్‌, సెప్టెంబరు 18: లంబాడాలను ఎస్టీ జాబితాలోంచి తొలగించకుం డా సీఎం కేసీఆర్‌ రిజర్వేషన్‌లు పెంచుతామనడంపై ఆదివాసీ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక కుమ్రం భీం ప్రాంగణం ఎదురు గా ఉన్న ఆదిలాబాద్‌-ఉట్నూర్‌ ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు గోడాం గణేష్‌, పుర్కబాపురావు మాట్లాడుతూ దేశంలో ఉన్న లంబా డాలను ఒకే గూటికి చేర్పించి రిజర్వేషన్‌లు కల్పిస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ తాము ఆందోళనలు చేస్తుంటే ఆదివాసీల మాటలను గౌరవించకుండా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఆదివాసీలకు చెందాల్సిన రిజర్వేషన్‌లను కొల్లగొట్టి అక్రమంగా అనుభవిస్తున్న లంబాడాలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. సీఎం ప్రకటన వెనిక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురా లు గోడాం రేణుకాబాయి, పెందూర్‌ పుష్పరాణి, ఉయిక ఇందిరాబాయి, సో యం రాందాస్‌, మానిక్‌రావు, కనక ప్రభాకర్‌, వెట్టి మనోజ్‌, నగేష్‌ పాల్గొన్నారు. 


Read more