నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , First Publish Date - 2022-12-16T01:14:10+05:30 IST
అక్షరజ్యోతి కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి ఆ దేశించారు. గురువారం సాయంత్రం ఇంద్రవెల్లి గిరిజన బాలికల జూ నియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇంద్రవెల్లి, డిసెంబరు 15: అక్షరజ్యోతి కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి ఆ దేశించారు. గురువారం సాయంత్రం ఇంద్రవెల్లి గిరిజన బాలికల జూ నియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, ఉత్తీర్ణతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీవో మాట్లాడు తూ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించేలా బోధన చేయాలని సూ చించారు. ప్రతీరోజూ నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. గిరి వి ద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు అక్షరజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వసతిగృహం, మరుగుదొడ్లు, పాఠశాల ప్రాంగణంలో నీరు నిల్వకుండా శుభ్రంగా ఉంచాలని అన్నారు. కార్యక్ర మంలో అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.