ఆసిఫాబాద్‌లో నిర్ధేశించిన రుణ లక్ష్యాలను సాధించాలి
ABN , First Publish Date - 2022-03-06T03:56:46+05:30 IST
జిల్లాలో నిర్దేశించిన రుణలక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం కలెక్టరే ట్‌లో అదనపుకలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు.
-కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆసిఫాబాద్, మార్చి 5: జిల్లాలో నిర్దేశించిన రుణలక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం కలెక్టరే ట్‌లో అదనపుకలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2021-22 ఆర్థికసంవత్సరానికిగాను రుణ ప్రణాళికలో రూ.2218.59 కోట్లులక్ష్యంగా నిర్దే శించగా 60శాతం సాధించామన్నారు. రుణ విస్తరణ దిశగా ప్రత్యేకదృష్టి సారించాల న్నారు. అర్హులైన రైతులకు పంటరుణాలు అందించాలని, రెండోపంట సాగుచేసే వారికి బోర్‌వెల్ రుణం అందించాలన్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతిబీమా, సురక్ష బీమాయోజన, ఏపీవై పథ కాలలో లబ్ధిదారుల ఎంపికత్వరిగతిన చేపట్టాలన్నారు. ఎంఎన్ ఎంఈ యూనిట్లు ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హులైన లబ్ధిదా రులకు రుణసదుపాయం కల్పించి ఆర్థికంగా ఎదిగేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్ హనుమంతరావు, ఆర్‌బీఐ అధికారి రాజేంద్ర ప్రసాద్, డీడీఎం అబ్దుల్ రవూఫ్, ఏజీఎం రవికిశోర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఎస్‌సీ కార్పొ రేషన్ ఈడీ సజీవన్, డీఐసీ జీఎం రఘు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.